- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో దారుణం
by Batti.Sumithra |
<p> ఏపీలోని విశాఖ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వీధుల్లో అందరూ చూస్తుండగా ఓ మహిళను ఏడుగురు వ్యక్తులు కొట్టుకుంటూ దాదాపు అర కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లారు. వివరాల్లోకెళితే.. గుత్తి లక్ష్మి అనే మహిళ ఎల్లపువానిపాలెం గ్రామంలో భర్త, పిల్లలతో కలిసి విశాఖలో అద్దెకు ఉంటోంది. నిన్న సాయంత్రం ఇంట్లో ఆమె భర్తలేని సమయంలో నగరానికి చెందిన ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు కారులో వచ్చి, లక్ష్మిపై దాడి చేశారు. వీధుల్లో […]</p>

X
ఏపీలోని విశాఖ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వీధుల్లో అందరూ చూస్తుండగా ఓ మహిళను ఏడుగురు వ్యక్తులు కొట్టుకుంటూ దాదాపు అర కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లారు. వివరాల్లోకెళితే..
గుత్తి లక్ష్మి అనే మహిళ ఎల్లపువానిపాలెం గ్రామంలో భర్త, పిల్లలతో కలిసి విశాఖలో అద్దెకు ఉంటోంది. నిన్న సాయంత్రం ఇంట్లో ఆమె భర్తలేని సమయంలో నగరానికి చెందిన ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు కారులో వచ్చి, లక్ష్మిపై దాడి చేశారు. వీధుల్లో కొట్టుకుంటూ తీసుకెళ్తుండగా, తనను రక్షించమని ఆమె స్థానికులను వేడుకుంది. అయినప్పటికీ ఎవరూ ఆమెను కాపాడే ప్రయత్నం చేయలేదు. లక్ష్మి తీవ్ర గాయాలపాలైంది. ఆమెపై ఎందుకు దాడి చేశారన్న విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Next Story






