అశ్వారావుపేటలో గంజాయి నిల్వలు.. మహిళ అరెస్టు

by  |
అశ్వారావుపేటలో గంజాయి నిల్వలు.. మహిళ అరెస్టు
X

దిశ, అశ్వారావుపేట టౌన్ : ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం పుల్లల బజారులో మరియమ్మ అనే మహిళ ఇంట్లో నిషేధిత గంజాయి లభ్యమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఎస్ఐ చల్లా అరుణ తన సిబ్బందితో కలిసి జరిపిన సోదాల్లో రెండున్నర కేజీల నిషేధిత గంజాయి దొరికింది. స్ధానిక తహసీల్దార్ చల్లా ప్రసాద్ సమక్షంలో పంచనామా నిర్వహించి పట్టుబడిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అయితే, సదరు మహిళ 2018లో కూడా గంజాయి అమ్ముతూ పట్టుబడటంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.


Next Story