- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భోజనం చేస్తూ.. అకస్మాత్తుగా కుప్పకూలి!
<p>దిశ, నల్లగొండ: ఆమె ఓ కంపెనీలో పనిచేస్తోంది. రోజులాగానే పని చేసి మధ్యాహ్నం తోటి కార్మికులతో కలిసి భోజనం చేసిన చోటనే ఒక్కసారిగా కుప్పకూలింది. కార్మికులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆమె కన్నుమూసింది. ఈ ఘటన భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు పారిశ్రామికవాడలోని మైక్రో ఫిల్టర్ కంపెనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ మండలం అవుషాపూర్ గ్రామానికి చెందిన బోగ ఉమ కొండమడుగు పారిశ్రామికవాడలోని మైక్రో ఫిల్టర్ కంపెనీలో […]</p>

దిశ, నల్లగొండ: ఆమె ఓ కంపెనీలో పనిచేస్తోంది. రోజులాగానే పని చేసి మధ్యాహ్నం తోటి కార్మికులతో కలిసి భోజనం చేసిన చోటనే ఒక్కసారిగా కుప్పకూలింది. కార్మికులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆమె కన్నుమూసింది. ఈ ఘటన భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు పారిశ్రామికవాడలోని మైక్రో ఫిల్టర్ కంపెనీలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ మండలం అవుషాపూర్ గ్రామానికి చెందిన బోగ ఉమ కొండమడుగు పారిశ్రామికవాడలోని మైక్రో ఫిల్టర్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం భోజనం చేస్తూ ఆకస్మాత్తుగా కుప్పకూలింది. ఆసుప్రతికి తరలించేలోపే చనిపోయింది. కంపెనీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబానికి యాజమాన్యం రూ.10 లక్షల నష్టంపరిహారం చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.






