- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమ పెళ్లి… వివాహిత దారుణ హత్య
<p>దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని యర్రబాలెంలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యర్రబాలెం గ్రామ పంచాయతి పరిధిలోని బేడ బుడగ జంగాల కాలనీకి చెందిన గురవయ్య కుమార్తె కిన్నెర వెంకటలక్ష్మి(19) అదే కాలనీకి చెందిన యాకయ్యలు గత మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా వెంకట లక్ష్మి శుక్రవారం తెల్లవారుజామున తమ నివాస గృహం సమీపంలో నిర్జీవంగా పడి ఉంది. […]</p>

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని యర్రబాలెంలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యర్రబాలెం గ్రామ పంచాయతి పరిధిలోని బేడ బుడగ జంగాల కాలనీకి చెందిన గురవయ్య కుమార్తె కిన్నెర వెంకటలక్ష్మి(19) అదే కాలనీకి చెందిన యాకయ్యలు గత మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.
కాగా వెంకట లక్ష్మి శుక్రవారం తెల్లవారుజామున తమ నివాస గృహం సమీపంలో నిర్జీవంగా పడి ఉంది. స్థానికులుగమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారాన్ని అందించారు. మృతురాలు వెంకటలక్ష్మి తలకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను ఎవరో తలపై బలంగా మోది హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. రూరల్ సీఐ శేషగిరిరావు.. వెంకటలక్ష్మి మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.






