కుటుంబ కలహాలతో గర్భిణి ఆత్మహత్య

by Shyam |   (  Updated:2020-04-14 00:13:46  IST  )

<p>దిశ, మెదక్: కుటుంబ కలహాలతో గర్భిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై గంగరాజు వివరాల ప్రకారం వెల్దుర్తి మండలం హస్తాలాపూర్ గ్రామ పరిధి గంగిరెద్దులవాడకు చెందిన శోభ(21)కు సురేష్‌తో రెండేండ్ల క్రితం వివాహం జరిగింది. అనంతరం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా తిరిగి స్వగ్రామానికి వచ్చారు. అయితే, కొంత కాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల గొడవులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన [&hellip;]</p>

కుటుంబ కలహాలతో గర్భిణి ఆత్మహత్య
X

దిశ, మెదక్: కుటుంబ కలహాలతో గర్భిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై గంగరాజు వివరాల ప్రకారం వెల్దుర్తి మండలం హస్తాలాపూర్ గ్రామ పరిధి గంగిరెద్దులవాడకు చెందిన శోభ(21)కు సురేష్‌తో రెండేండ్ల క్రితం వివాహం జరిగింది. అనంతరం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా తిరిగి స్వగ్రామానికి వచ్చారు. అయితే, కొంత కాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల గొడవులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన శోభ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె గర్భిణి అని కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags: Medak,Women suicide,Confrontation at home

Next Story