- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూకట్పల్లిలో మహిళ అదృశ్యం
by Batti.Sumithra |
<p>దిశ, కూకట్పల్లి: భర్త బయటికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో నుంచి మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కూకట్పల్లి గ్రామంలోని రామాలయం వీధిలో నివాసం ఉంటున్న విరిగినేని మాల్యాద్రి అనే వ్యక్తి ఈ నెల 25వ తేదిన ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్లి మద్యహ్నం 3 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వచ్చాడు. అతడు వచ్చేసరికి అతడి భార్య విరిగినేని రత్తమ్మ ఇంట్లో […]</p>

X
దిశ, కూకట్పల్లి: భర్త బయటికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో నుంచి మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కూకట్పల్లి గ్రామంలోని రామాలయం వీధిలో నివాసం ఉంటున్న విరిగినేని మాల్యాద్రి అనే వ్యక్తి ఈ నెల 25వ తేదిన ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్లి మద్యహ్నం 3 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వచ్చాడు. అతడు వచ్చేసరికి అతడి భార్య విరిగినేని రత్తమ్మ ఇంట్లో లేదు. చుట్టు పక్కల తెలిసిన వారి వద్దకు వెళ్లి గాలించినా ఫలితం లేదు. దాంతో అతడు శుక్రవారం కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాల్యాద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు రతమ్మ కోసం గాలిస్తున్నారు.
Next Story






