భర్తను వదిలేసి యువతిని పెళ్లాడిన మహిళ.. బాబు పుట్టినా తగ్గని ప్రేమ!

by  |
Woman married
X

దిశ, వెబ్‌డెస్క్ : స్వేచ్ఛా ముసుగులో వివాహ బంధాలు రోజురోజుకు పక్క దారి పడుతున్నాయి. ఆలుమగలు అయ్యాక కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం.. పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేయడం.. ఇష్టాలకు అనుగుణంగా గే, స్వలింగ సంపర్కం చేయడం శరా మాములుగా మారిపోయింది. వర్కింగ్ హాస్టల్స్ వచ్చాక ఈ సంస్కృతి మరీ ఎక్కువ అయింది. తాజాగా ఓ ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడంతోపాటు పెళ్లి కూడా చేసుకుని జీవిస్తున్నారు. అది కూడా ఓ వివాహిత భర్తను వదిలేసి వెళ్లి.. మరో యువతిని పెళ్లాడటం సంచలనంగా మారింది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సెక్స్ గురించి తెలుసుకునేందుకు 11 ఏళ్లకే పోర్న్ వీడియోలు చూశా : స్టార్ సింగర్

మూడేళ్ల క్రితం నల్లగొండ జిల్లాకు చెందిన యువతి, మెదక్ జిల్లా గజ్వేల్‌కు చెందిన యువతి కలిసి హైదరాబాద్‌లోని ఓ వర్కింగ్ హాస్టల్‌లో ఉండి చదువుకున్నారు. ఒకే రూంలో ఉండే వీరిద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితిలో స్నేహం చేశారు. అన్ని భావాలను పంచుకునే ఆ ఇద్దరు క్రమంగా ఒకరికొకరు ప్రేమలో పడ్డారు. సమాజం ఒప్పుకోదని తెలిసినా ఇద్దరూ పెళ్లి చేసుకుని జీవించాలనుకున్నారు. అంతలోనే నల్లగొండ యువతి కుటుంబ సభ్యులకు వీరి ప్రేమ విషయం తెలియడంతో పోలీసుల సహాయంతో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి విడదీశారు. వెంటనే ఆ యువతిని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం చేశారు.

సమంత బోల్డ్ లుక్స్.. రికార్డులు బద్దలు కొడుతున్నాయిగా!

రెండేళ్లకు పైగా కాపురం చేసిన ఆమెకు ఓ కుమారుడు కూడా జన్మించాడు. అయితే ఇటీవల తరచూ భర్తతో గొడవ పడిన ఆమె.. మూడు నెలల క్రితం పుట్టింటికి చేరింది. అక్కడే ఉంటున్న ఆ వివాహిత వారం రోజుల క్రితం ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయింది. బంధువులు, మిత్రుల దగ్గర వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఫోన్ నంబర్ ఆధారంగా గాలించగా.. తన ప్రియురాలి వద్దే ఉన్నట్లు తెలిసింది. భర్తను వదిలేసిన ఆ వివాహిత తన గర్ల్ ఫ్రెండ్ వద్దకు చేరి ఆమెను వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఇద్దరూ విడిపోయి ఉండలేక.. ఒకరినొకరు మర్చిపోలేకే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. తన కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తోన్న గజ్వేల్ యువతి కోసమే నల్లగొండ యువతి భర్తను వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. వారిద్దరినీ కస్టడీలోకి తీసుకుని నల్లగొండలో ప్రత్యేక విభాగం టీంతో కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు పోలీసులు గోప్యత పాటిస్తున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed