- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందారు. బస్తర్ జిల్లా దర్బా పోలీస్‌స్టేషన్ పరిథిలోని చందమెట – ప్యారాభట్ అటవీప్రాంతంలో ఉదయం 8 గంటల సమయంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లుగా నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు బస్తర్ – సుక్మా జిల్లాల పోలీసులు సంయుక్త కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడి కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపినట్లు పోలీసులు […]</p>

X
దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందారు. బస్తర్ జిల్లా దర్బా పోలీస్‌స్టేషన్ పరిథిలోని చందమెట – ప్యారాభట్ అటవీప్రాంతంలో ఉదయం 8 గంటల సమయంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లుగా నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు బస్తర్ – సుక్మా జిల్లాల పోలీసులు సంయుక్త కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడి కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపినట్లు పోలీసులు స్పష్టం చేశారు. కాల్పుల అనంతరం సంఘటన ప్రాంతంలో యూనిఫాంలో ఉన్న ఒక మహిళా మావోయిస్టు మృతదేహం, ఏకె 47 ఆయుధం, రెండు పిస్టల్స్, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇంకా అక్కడ కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






