- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్నింగ్ జర్నీలో డివైడర్‌ను ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో మహిళ మృతి
<p>దిశ, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. శనివారం ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్మూర్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన దహారని ఆస్మాగా నిర్ధారించారు. ఇచ్చోడ వాసి అమీర్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి తన ఫార్చునర్ కారులో హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యలో పెర్కిట్ వద్దకు రాగానే […]</p>

X
దిశ, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. శనివారం ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్మూర్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన దహారని ఆస్మాగా నిర్ధారించారు. ఇచ్చోడ వాసి అమీర్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి తన ఫార్చునర్ కారులో హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యలో పెర్కిట్ వద్దకు రాగానే వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. అమీర్ భార్య ఆస్మా ఘటనా స్థలంలోనే మృతిచెందారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
- Tags
- armur
Next Story






