- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైవరెడ్లపల్లిలో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తన భూమిలో సర్వే నిర్వహిస్తున్న అధికారుల ముందే ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రామకుప్పం మండలం బైవరెడ్లపల్లిలో ప్రభుత్వం భవనం కోసం ఓ మహిళకు చెందిన భూమిలో సర్వే నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ అధికారుల ముందే పురుగుల మందు తాగా ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తన భూమిలో సర్వే నిర్వహిస్తున్న అధికారుల ముందే ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రామకుప్పం మండలం బైవరెడ్లపల్లిలో ప్రభుత్వం భవనం కోసం ఓ మహిళకు చెందిన భూమిలో సర్వే నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ అధికారుల ముందే పురుగుల మందు తాగా ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






