- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డాబా మీద మల్లెల పరిమళాలు.. సంపాదన నెలకు రూ.85 వేలు!
<p>దిశ, ఫీచర్స్ : మంగళూరుకు చెందిన కిరణ దేవడిగ లాయర్ విద్యను అభ్యసించినా.. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయాలనే ఆసక్తి ఉండేది. వర్క్ షెడ్యూల్‌తో పాటు భూమి అందుబాటులో లేకపోవడంతో తన ఫార్మింగ్ కలను పక్కన పెట్టింది. ఎంతోమందికి లాక్‌డౌన్ ఓ పీడకలగా మిగిలితే, ఆమె ‘డ్రీమ్’కు మాత్రం జీవంలా మారింది. పాండమిక్ పరిస్థితుల్లోని ఖాళీ సమయాన్ని ‘టెర్రస్ గార్డెనింగ్’కు వినియోగించుకుంది. కానీ అందరిలా కూరగాయాలు, పండ్ల మొక్కలు కాకుండా ‘ఉడిపి మల్లెల్ని’ పెంచాలనుకుంది. ఆ నిర్ణయం […]</p>

దిశ, ఫీచర్స్ : మంగళూరుకు చెందిన కిరణ దేవడిగ లాయర్ విద్యను అభ్యసించినా.. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయాలనే ఆసక్తి ఉండేది. వర్క్ షెడ్యూల్‌తో పాటు భూమి అందుబాటులో లేకపోవడంతో తన ఫార్మింగ్ కలను పక్కన పెట్టింది. ఎంతోమందికి లాక్‌డౌన్ ఓ పీడకలగా మిగిలితే, ఆమె ‘డ్రీమ్’కు మాత్రం జీవంలా మారింది. పాండమిక్ పరిస్థితుల్లోని ఖాళీ సమయాన్ని ‘టెర్రస్ గార్డెనింగ్’కు వినియోగించుకుంది. కానీ అందరిలా కూరగాయాలు, పండ్ల మొక్కలు కాకుండా ‘ఉడిపి మల్లెల్ని’ పెంచాలనుకుంది. ఆ నిర్ణయం ఆమె జీవితాన్నే మార్చేసింది.

ఉడిపి మల్లెలను శంకరపుర మల్లిగే అని కూడా పిలుస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో భిన్న రకాల మల్లెలను పండిస్తుండగా ఉడిపి జాస్మిన్ మాత్రం దాని అసమానమైన సువాసనకు పెట్టింది పేరు. భౌగోళిక గుర్తింపు (GI) కూడా కలిగిన ఈ మల్లెలను.. అసలు వ్యవసాయంలో ఎలాంటి అనుభవం లేని కిరణ డాబా మీద పెంచేందుకు సిద్ధపడింది. దీంతో ఇంటి సభ్యులతో పాటు స్నేహితులు కూడా ఆమెను చూసి నవ్వారు. కానీ సంకల్పముంటే ఏ పనైనా చేయగలమని నమ్మిన కిరణ.. 90 మల్లె మొక్కలతో తన ఫార్మింగ్ జర్నీని ప్రారంభించింది. ఈ క్రమంలోనే నేల రకం, మొక్కకు ఎంత నీరు అవసరం, ఏ రకమైన ఎరువు ఉపయోగించాలి వంటి విషయాలను తెలుసుకోవడానికి పలువురు తోటమాలులు, నర్సరీ యజమానులతో సంభాషించింది. మరింత జ్ఞానం కోసం యూట్యూబ్ వీడియోలను చూసింది. ఈ మేరకు మూడు నెలలపాటు కిరణ, ఆమె భర్త మహేష్ ఈ మొక్కలకు అవసరమైన పోషకాలు, నీరు అందిస్తూ సంరక్షించారు. దాదాపు ఆరు నెలల తర్వాత ఆమె పువ్వులను కోయగా, ఊహంచని విధంగా మల్లెల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ఆమె నెలకు 85వేల రూపాయలు సంపాదిస్తోంది.

‘మొక్కలు, పూలకుండీలు, ఎరువులు కలిపి సుమారు రూ.12000 పెట్టుబడితో, జీరో నాలెడ్జ్‌తో మల్లెల్ని పండించడం మొదలుపెట్టాను. కానీ అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ రోజు నన్ను ఎగతాళి చేసిన వారందరూ ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. చివరకు మా చెల్లెళ్లు కూడా నా స్ఫూర్తితో మల్లెపూలు పెంచడం మొదలుపెట్టారు. మల్లెపూలు పండించడం పెద్ద కష్టమేమి కాదు కానీ దానికోసం కొంత సమయాన్ని కేటాయించాలి. చాలామంది ఏదో ఒకటి చేయాలని భావిస్తుంటారు కానీ సమయం లేదంటూ ఫిర్యాదు చేస్తుంటారు. దానికి బదులుగా మీ కలను నెరవేర్చుకునేందుకు వీలు కల్పించుకుంటే విజయం తప్పక వరిస్తుంది. మీ కల ఎంత చిన్నదైనా, దాన్ని చూసి పదిమంది హేళన చేసినా సరే వెనక్కి తగ్గకండి’ అని కిరణ చెప్పుకొచ్చింది.






