- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భక్తులు లేకుండానే.. పూరి జగన్నాథుడి రథయాత్ర
<p>భువనేశ్వర్: ఒడిశాలో పూరి జగన్నాథుడి రథయాత్ర ఈ సారి కూడా భక్తుల్లేకుండానే జరగనుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే యాత్ర నిర్వహిస్తామని ఒడిశా ప్రభుత్వం గురువారం ప్రకటించింది. జులై 12న రథయాత్ర జరగనుంది. క్రతువులు పూరి ఆలయానికే పరిమితం కానున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, రథాలను లాగడానికి కేవలం 500 మందికి అనుమతి ఉన్నది. గతేడాది మాదిరిగానే చాలా తక్కువ మంది ఇందులో పాల్గొంటారని, నెగెటివ్ ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టు లేదా, రెండు డోసులు టీకా వేసుకున్నవారికి స్నాన […]</p>

భువనేశ్వర్: ఒడిశాలో పూరి జగన్నాథుడి రథయాత్ర ఈ సారి కూడా భక్తుల్లేకుండానే జరగనుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే యాత్ర నిర్వహిస్తామని ఒడిశా ప్రభుత్వం గురువారం ప్రకటించింది. జులై 12న రథయాత్ర జరగనుంది. క్రతువులు పూరి ఆలయానికే పరిమితం కానున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, రథాలను లాగడానికి కేవలం 500 మందికి అనుమతి ఉన్నది. గతేడాది మాదిరిగానే చాలా తక్కువ మంది ఇందులో పాల్గొంటారని, నెగెటివ్ ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టు లేదా, రెండు డోసులు టీకా వేసుకున్నవారికి స్నాన యాత్ర, గుడించ యాత్ర, బహుద, సునా, భేసలాంటి క్రతువులకు అనుమతిస్తారని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. కరోనాకు ముందు ఈ యాత్రకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చేవారు. ఈ నేపథ్యంలోనే పూరి నగరానికి ప్రవేశమార్గాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం మూసేసే నిర్ణయం తీసుకుంది. జులై 12 మొదలు వారంపాటు కర్ఫ్యూ విధిస్తామని ఇటీవలే ప్రకటించింది.






