త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టిన విప్రో!

by  |
త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టిన విప్రో!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ త్రైమాసికంలో ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో మిగిలిన దిగ్గజ ఐటీ కంపెనీల బాటలో మెరుగైన ఫలితాలను వెల్లడించింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీ తరహాలోనే విప్రో సైతం అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలను కంపెనీ బుధవారం ప్రకటించింది. మూడో త్రైమాసికంలో విప్రో నికర లాభాలు 20.8 శాతం పెరిగి రూ. 2,966.70 కోట్లుగా పేర్కొంది. అంతకుముందు ఏడాది కంపెనీ రూ .2,455.80 కోట్లను నమోదు చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 1.3 శాతం వృద్ధితో రూ. 15,670 కోట్లకు చేరుకున్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

అంతకుముందు ఏడాది కంపెనీ ఆదాయం రూ. 15,470 కోట్లుగా ఉంది. ఈ ఫలితాలతో కంపెనీ పలు రేటింగ్ ఏజెన్సీల అంచనాలకు మించి గణాంకాలను నమోదు చేసింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ మెరుగైన పనితీరుతో ఆకట్టుకుందని, అంతేకాకుండా గతేడాది కంపెనీ మొత్తం 14 వేల నియామకాలు చేపట్టినట్టు విప్రో సీఈఓ థియర్రీ డెలాపోర్ట్‌ చెప్పారు. ఈ నియామకాల్లో ఫ్రెషర్స్ 2,900 మంది ఉన్నారని పేర్కొన్నారు.


Next Story

Most Viewed