ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 80 శాతం మందికి వేతనాలు పెంపు!

by  |
Wipro
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో తన మొత్తం ఉద్యోగుల్లో అర్హత కలిగిన 80 శాతం మందికి వేతనాలను పెంచనున్నట్టు ప్రకటించింది. కొవిడ్ సంక్షోభ సమయంలో ఉద్యోగులకు వేతన పెంపు ద్వారా మద్దతివ్వడం ఈ ఏడాది ఇది రెండోసారి కావడం విశేషం. ప్రస్తుత ఏడాది జనవరిలో అర్హత కలిగిన ఉద్యోగులకు వేతనాలను పెంచింది. అసిస్టెంట్ మేనేజర్, అంతకంటే దిగువ స్థాయిలో అర్హత ఉన్న ఉద్యోగులందరికీ మెరిట్ వేతన పెంపును ఇవ్వనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇది ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి అమ్మల్లో వస్తుందని తెలిపింది. అలాగే, మేనేజర్, అంతకంటే పైస్థాయిలో అర్హత కలిగిన ఉద్యోగులకు జూన్ 1 నుంచి వేతనాల పెంపు అమలవుతుందని విప్రో స్పష్టం చేసింది. విప్రోలో ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం 1,97,712 మంది ఉద్యోగులున్నారు. మార్చి త్రైమాసికంలో కొత్తం 7,700 మందిని నియమించింది. అంతేకాకుండా ఈ ఏడాది కొత్తగా 18,000 మంది ఫ్రెషర్లను తీసుకోవాలని కంపెనీ భావిస్తోంది. దేశీయ మరో దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్‌లో వేతన పెంపు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed