వైన్స్‌లో ఎక్స్‌పైర్ డేట్ దాటిన బీర్లు అమ్మకం.. ఒకరికి అస్వస్థత

402
Wines

దిశ, భువనగిరి రూరల్ : గడువు ముగిసిన బీర్లను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు వైన్ షాప్ నిర్వహకులు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని న్యూ మత్స్యగిరి వైన్స్‌లో కొనుగోలు చేసిన బీరు తాగి ఓ వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. బుధవారం రాత్రి రాజు అనే వ్యక్తి బడ్ వైజర్ బీరు కొనుగోలు చేసి, దానిని కొంచెం తాగగానే వాంతులు అయ్యాయి.

expired beers

వెంటనే బీరుపై గడువు తేదీ చూడగా ఎక్స్‌పైర్ డేట్ దాటి ఉంది. దీంతో కాలం ముగిసిన బీర్లు అమ్ముతున్నారని వెంటనే న్యూ మత్స్యగిరి వైన్స్‌ వద్దకు వెళ్లి ప్రశ్నించాడు. వారి వద్ద నుంచి నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో వెంటనే ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. స్పందించిన ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ వెంటనే వైన్స్ వద్దకు చేరుకుని తనిఖీలు చేశారు. వైన్స్‌లో ఎక్స్‌పైర్ డేట్ దాటిన 16 బీర్లను గుర్తించి సీజ్ చేశారు. అనంతరం వాటిని స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..