నిరుద్యోగులకు శుభవార్త..ఉద్యోగ అవకాశాలు

by  |
నిరుద్యోగులకు శుభవార్త..ఉద్యోగ అవకాశాలు
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి తెచ్చిన సంక్షోభంలో ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయింది. జాబ్ ఉంటుందో? ఊడుతుందో? తెలియకుండా పోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వెంటనే జాబ్ కావాలంటే.. దొరుకుతుందా? చాలా కష్టమే. అందుకే.. నిరుద్యోగుల కష్టాలను తీర్చేందుకు.. కొత్త ఉద్యోగాలను వెతికే పెట్టేందుకు.. ఇటీవలే ఓ కొత్త వెబ్‌సైట్ ప్రారంభమైంది. డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టింగ్ సంస్థ మార్కివిస్ ‘మండే జాయినింగ్’ పేరుతో ఓ పోర్టల్ ప్రారంభించింది. ఇందులో జాబ్ ఆఫర్స్ ఉంటాయి.

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్ఐఈ) ఫిబ్రవరిలో సగటు ఉద్యోగుల సంఖ్య 404 మిలియన్లు ఉండగా, జూన్ వరకు ఆ సంఖ్య 374 మిలియన్లకు పడిపోయింది. అంటే.. లాక్ డౌన్ పీరియడ్‌లో దాదాపు 30 మిలియన్ల మంది తమ ఉద్యోగాన్ని కోల్పోయారు. ఇవి కేవలం ఉద్యోగం ఉన్నవారు జాబ్ కోల్పయిన లెక్కలు. వీళ్లే కాకుండా.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వాల్ల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. వాళ్లందరికీ ఈ ‘మండే జాయినింగ్’ కొత్త అవకాశాలను చూపిస్తుంది.

ఉద్యోగులను నియమించుకోవాలనుకునే సంస్థలు ఇందులో రిజిస్టర్ చేసుకుంటాయి. జాబ్ సీకర్స్ కూడా.. ఇందులో తమ డీటెయిల్స్, రెజ్యుమే అప్‌లోడ్ చేస్తే సరి. అటు కంపెనీలను, ఇటు నిరుద్యోగులను ఒకేచోట చేర్చే ప్లాట్‌ఫామ్ ఇది. జాబ్‌కు తగ్గ స్కిల్స్ ఉంటే.. కంపెనీల నుంచి వెంటనే ఆఫర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మండే జాయినింగ్ నిర్వాహకులు అంటున్నారు. ప్రస్తుతం చాలావరకు కంపెనీల్లో రెండు మూడు నెలలు నోటీస్ పీరియడ్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని వల్ల కొత్త కంపెనీల్లో జాయినింగ్స్‌ ఆలస్యం అవుతున్నాయి. కానీ, ఈ పోర్టల్‌లో జాబ్ ఆఫర్ యాక్సెప్ట్ చేసిన 14 రోజుల్లోనే ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది.

‘మండే జాయినింగ్’ పోర్టల్‌లో ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇందులో జాబ్ డిస్క్రిప్షన్స్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రెజ్యూమె అప్‌లోడ్ చేస్తే చాలు. రిక్రూటర్లు తమకు కావాల్సిన జాబ్ సీకర్స్‌ను సెర్చ్ ద్వారా తెలుసుకుంటారు. ఇప్పటివరకు ‘మండే జాయినింగ్’ పోర్టల్‌లో 37,000 మందికి పైగా అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు.


Next Story

Most Viewed