మా ఎమ్మెల్యేపైనే వార్త రాస్తావా..?! ‘దిశ’ ప్రతినిధికి బెదిరింపులు

by  |
మా ఎమ్మెల్యేపైనే వార్త రాస్తావా..?! ‘దిశ’ ప్రతినిధికి బెదిరింపులు
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : మా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్త రాస్తావా.? నీకెంత ధైర్యమంటూ మ‌హ‌బూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండ‌ల జ‌డ్పీటీసీ శ్రీనివాస‌రెడ్డి అని చెబుతూ శ‌నివారం రాత్రి వ‌రంగ‌ల్ దిశ ప్రతినిధికి ఫోన్ చేసి బెదిరింపుల‌కు పాల్పడ్డాడు. మ‌మ‌త అనే మ‌హిళ పేరుతో మ‌హ‌బూబాబాద్ ప‌ట్టణంలో శ‌నివారం ఉద‌యం అంబేద్కర్ సెంట‌ర్‌లో పోస్టర్లు వెలిశాయి. ఎమ్మెల్యే త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌కుండా క్రిమిన‌ల్స్‌కు స‌హ‌క‌రిస్తున్నాడ‌ని స‌ద‌రు మ‌హిళా ఆ వాల్ పోస్టర్‌లో ఆరోపించింది.

ఇదే విష‌యాన్ని దిశ మీడియా వెబ్సైట్‌, డైన‌మిక్ ఎడిష‌న్లలో వార్తను ప్రచురించింది. మ‌హ‌బూబాబాద్‌లో వెలిసిన పోస్టర్లకు సంబంధించిన ఫొటోల‌ను కూడా సాక్ష్యంగా వార్తకు జ‌త చేయ‌డం జ‌రిగింది. ఆ పోస్టర్‌లో మ‌హిళ చేసిన ఆరోప‌ణ‌ల‌నే వార్తగా ప్రచురించింది. పోస్టర్‌లోని అంశాల‌ను ఉన్నది ఉన్నట్లుగా వార్త రూపంలో ప్రచురించింది. అయితే ఈ వార్త శంక‌ర్‌నాయ‌క్‌కు వ్యతిరేకంగా ఉంద‌ని, ఎలా రాశావంటూ వ‌రంగ‌ల్ దిశ ప్రతినిధికి నెల్లికుదురు జ‌డ్పీటీసీ శ్రీనివాస‌రెడ్డి అనే పేరు చెప్పిన వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపుల‌కు పాల్పడ్డాడు. వరంగ‌ల్‌లో నువ్వెక్కడున్నావో చెప్పు.. నీ అంతు చూస్తా..అంటూ ఫోన్‌లో బెదిరింపుల‌కు పాల్పడ‌టం గ‌మ‌నార్హం.

Next Story

Most Viewed