‘కబ్జా’ చేసేది అతడేనా?

36

దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ స్టార్ ఉపేంద్ర నటించిన ‘కబ్జా’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఏడు భాషల్లో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచగా, సంక్రాంతి కానుకగా మరో బిగ్ అప్‌డేట్‌తో ముందుకొచ్చింది మూవీ యూనిట్. ఈ సినిమాలో ఉపేంద్రతో పాటు మరో హీరో కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడని అఫిషియల్‌గా ప్రకటించింది.

‘కేజీఎఫ్ చాప్టర్ -1’ సినిమాతో కన్నడ సినిమా స్థాయి పాన్ ఇండియా లెవల్‌కు ఎదిగింది. కేజీఎఫ్ 2, ఫాంటమ్ చిత్రాలతో పాటు ఉపేంద్ర ‘కబ్జా’ కూడా 7 భాషల్లో తెరకెక్కడమే అందుకు నిదర్శనం. కాగా ఈ సినిమాకు మరింత గ్రాండ్ అప్పీల్ తీసుకురావడంతో పాటు, అభిమానుల అటెన్షెన్ డ్రా చేయడానికి ప్రముఖ హీరో కిచ్చా సుదీప్‌ను ‘కబ్జా’లో నటింపజేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా, సంక్రాంతి సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు ప్రకటించబోతున్నట్లుగా పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. కాగా ఆ మరో స్టార్ ఎవరై ఉంటారా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సుదీప్, ఉపేంద్ర ఇదివరకే ‘ఓ మై గాడ్’ కన్నడ రీమేక్‌లో కలిసి నటించారు.