కొవిడ్ కట్టడిలో గేమ్ చేంజర్‌‌‌గా ‘ఇంట్రానాసల్’

by  |
కొవిడ్ కట్టడిలో గేమ్ చేంజర్‌‌‌గా ‘ఇంట్రానాసల్’
X

దిశ, ఫీచర్స్ : కొవిడ్ కట్టడిలో గేమ్ చేంజర్‌గా భావిస్తున్న నాసల్ వ్యాక్సిన్ కోసం ఇప్పుడు ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఇప్పటికే ‘కొవాగ్జిన్’ పేరుతో కొవిడ్-19 వ్యాక్సిన్ రిలీజ్ చేసిన భారత్ బయోటిక్.. ‘ఇంట్రానాసల్’ వ్యాక్సిన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఫేజ్ 1, ఫేజ్ 2 ట్రయల్స్ ప్రారంభించిన కంపెనీ.. డిసెంబర్ నాటికి 10 కోట్ల డోసులు ఉత్పత్తి చేసే లక్ష్యంతో పనిచేస్తోంది. నీతి అయోగ్ సైతం ఈ వ్యాక్సిన్‌ను గేమ్ చేంజర్‌గా అభివర్ణించడం విశేషం.

నీడిల్ ఫ్రీ, పెయిన్‌లెస్ ప్రత్యేకతలున్న ఈ వ్యాక్సిన్ వల్ల ఇన్‌ఫెక్షన్స్ తలెత్తే ప్రమాదం లేదు. వ్యాక్సినేషన్ కోసం హెల్త్ వర్కర్స్ అవసరం కూడా లేదు. పిల్లలు, పెద్దలు అందరికీ సూట్ అయ్యే ఈ వ్యాక్సిన్.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వ్యాక్సిన్ల డిమాండ్‌ను ఫుల్‌ఫిల్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా నాలుగు రకాల నాసల్ వ్యాక్సిన్స్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. ఒక్కో ముక్కు రంధ్రంలో 0.1 మి.లీ. చొప్పున వేసుకుంటే చాలు.. యాంటీ బాడీస్ డెవలప్ చేయడంతో పాటు రక్షణ కల్పించనున్నాయి. కాగా ఈ నాసల్ డ్రాప్స్ సింగిల్ డోస్‌తోనే ఎఫెక్ట్ పనిచేయడం విశేషం.


Next Story

Most Viewed