- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్యాన్స్ వెంకటేష్ అదిరిపోయే ట్రీట్..సంక్రాంతికి ఇక జాతరే !
అనిల్ రావిపూడితో చేసే సినిమా ఫినిష్ చేసేందుకు వెంకటేష్ ప్లాన్ చేస్తున్నారట.

దిశ, వెబ్ డెస్క్: విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దగ్గుబాటి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విక్టరీ వెంకటేష్... ఏజ్ పైబడినా, అదిరిపోయే సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. ముఖ్యంగా కామెడీ జోనర్ సినిమాలతో.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విక్టరీ వెంకటేష్, ఈ ఏడాది రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నాడు వెంకటేష్.
ఈ సినిమా అతి త్వరలోనే రిలీజ్ కానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో మూవీ ఉండగా... అక్టోబర్ వరకు ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు వెంకటేష్ ప్లాన్ చేస్తున్నారట. ఆ సినిమా కూడా మూడు నెలల్లో ఫినిష్ చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని సన్నద్ధమవుతున్నట్టు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే.. ఈసారి విక్టరీ వెంకటేష్ డబుల్ ట్రీట్ ఇస్తారని నడుస్తోంది.






