- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లు అర్జున్ కొత్త సినిమాకు బ్రేకులు..ఫాక్ లో ఫ్యాన్స్ ?
అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే పాపులర్ హీరోగా మారిన వారిలో అల్లు అర్జున్ మొదటి వరుసలో ఉంటారు. అలాంటి అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారారు. ఆ తర్వాత వరుసగా పెద్ద సినిమాలకు సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో పెద్ద సినిమా చేస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమానే రాకా. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగా, వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా హీరో, క్రేజీ డైరెక్టర్ ప్రాజెక్టు మూలకు పడిందని ప్రచారం చేస్తుండగా.. దాన్ని AA23 తో కొంతమంది లింక్ చేస్తున్నారు. ఈ తరుణంలో రచయిత రత్నకుమార్ పరోక్షంగా దీనిపై క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్-లోకేష్ ప్రాజెక్టు కొనసాగుతుందని హింట్ ఇచ్చారు. కమల్ హాసన్ విక్రమ్ మూవీకి నాలుగేళ్లయిన సందర్భంగా ట్వీట్ చేసిన ఆయన...AA 23 మూవీ కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.






