- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వైద్యులపై దాడులు చేస్తే కఠిన చర్యలు’
by Shyam |
<p>హైదరాబాద్: వైద్యులపై దాడులు చేసే మూర్ఖులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఇందుకోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని నల్లకుంటలో రక్తదాన శిబిరాన్ని రాజేందర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్లు వారి ప్రాణాలను ఫణంగా పెట్టి బాధితులకు చికిత్స చేస్తున్నారని తెలిపారు. ‘‘నాకు ఏ దేవుడూ లేడు. వైద్యుడే నా దేవుడు’’ అని కరోనా నుంచి కోలుకున్న అనంతరం బ్రిటన్ ప్రధాని చేసిన […]</p>
X
హైదరాబాద్: వైద్యులపై దాడులు చేసే మూర్ఖులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఇందుకోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని నల్లకుంటలో రక్తదాన శిబిరాన్ని రాజేందర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్లు వారి ప్రాణాలను ఫణంగా పెట్టి బాధితులకు చికిత్స చేస్తున్నారని తెలిపారు. ‘‘నాకు ఏ దేవుడూ లేడు. వైద్యుడే నా దేవుడు’’ అని కరోనా నుంచి కోలుకున్న అనంతరం బ్రిటన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. కాగా, ఈ శిబిరంలో టీఎన్జీవోకు చెందిన దాదాపు 200 మంది రక్తదానం చేశారు.
tag; minister etela, blood donation camp, nallakunta, hyd
Next Story






