కత్రినా-విక్కీని భార్యాభర్తలుగా ధృవీకరించిన వికీపీడియా.. స్క్రీన్ షాట్స్ వైరల్

by  |
Katrina And Vickys
X

దిశ, సినిమా : బీటౌన్ ఫ్యాట్ వెడ్డింగ్స్‌లో ఒకటిగా చెప్పబడుతున్న ‘విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌’ పెళ్లి గురించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. మెహందీ వేస్తున్నదెవరు? ఫ్యాషన్ డిజైనర్స్ డీటెయిల్స్ ఏంటి? కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్ని రకాల వంటకాలు ఉండబోతున్నాయి? గెస్ట్ లిస్ట్.. ఇలా ప్రతీది వైరల్ అవుతోంది. కానీ వెడ్డింగ్ స్పాట్ నుంచి మాత్రం ఒక్క ఫొటో కూడా లీక్ కాలేదు.

దీంతో ఫైర్ అయిన కొందరు ఆకతాయిలు.. వికీపీడియాలో విక్కీ అండ్ కాట్స్ బయోగ్రఫీ అప్‌డేట్ చేశారు. డిసెంబర్ 10న పెళ్లి జరగనుండగా.. ఈలోపే భార్యాభర్తలుగా ఎడిట్ చేశారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. అయితే కాసేపటికే వికీపీడియా నిర్వాహకులు మళ్లీ బయోగ్రఫీ డీటెయిల్స్‌ నార్మల్‌గా మార్చేశారు.

https://twitter.com/KatrinasMagical/status/1468271922366455813?s=20

Next Story