మరణంలో ను కలిసే.. భర్త మరణించిన కొన్ని గంటలకే భార్య..

by Shyam |

<p>దిశ, చౌటుప్పల్: ఓ వృద్ధ దంపతులు కడదాక కలిసి కాపురం చేసి కాటికి కూడా కలిసే పోయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన వృద్ధ దంపతులు ఎడ్ల లక్ష్మమ్మ(85), ఎడ్ల లక్ష్మయ్య(90) ఇద్దరు దంపతులు. మంగళవారం భర్త లక్ష్మయ్య అనారోగ్యంతో మరణించగా భార్య లక్ష్మమ్మ మనోవేదనతో ఏడుస్తూ అదే రోజు గంటల వ్యవధిలోనే మరణించింది. భార్యాభర్తలిద్దరూ కడదాక కలిసి కాపురం చేసి [&hellip;]</p>

మరణంలో ను కలిసే.. భర్త మరణించిన కొన్ని గంటలకే భార్య..
X

దిశ, చౌటుప్పల్: ఓ వృద్ధ దంపతులు కడదాక కలిసి కాపురం చేసి కాటికి కూడా కలిసే పోయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన వృద్ధ దంపతులు ఎడ్ల లక్ష్మమ్మ(85), ఎడ్ల లక్ష్మయ్య(90) ఇద్దరు దంపతులు. మంగళవారం భర్త లక్ష్మయ్య అనారోగ్యంతో మరణించగా భార్య లక్ష్మమ్మ మనోవేదనతో ఏడుస్తూ అదే రోజు గంటల వ్యవధిలోనే మరణించింది.

భార్యాభర్తలిద్దరూ కడదాక కలిసి కాపురం చేసి ఒకే రోజు మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. బుధవారం అంత్యక్రియల్లో భాగంగా రెండు పార్థివదేహలను కాటికి కూడా కలిసే వెలుతుండడంతో చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. ఆ వృద్ధ దంపతులకు కొడుకులు లేకపోవడం, ఇద్దరు కూతుళ్లు కలిసి చెరొకరికి తలకొరివి పెట్టడం చూసిన జనం కన్నీరుమున్నీరుగా విలపించారు.

Next Story