దాన్ని పట్టి కొడితే భర్త మృతి

9

దిశ, వెబ్‌డెస్క్: ప్రియుడి పై మోజు పడ్డ భార్య భాగోతంతో భర్త మందుకు బానిసయ్యాడు. మందుకు బానిసైన భర్త.. ఇంకో మగాడితో సంబంధం ఎలా సాగిస్తున్నావని గొడవకు దిగాడు. తాగిన మైకంలో తూలుతూ.. ఊగుతూ ఉన్న భర్త పై అదును చూసి భార్య దాడి చేసి హత్య చేసింది. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రియుడితో పథకం వేసి చివరకు కటకటాలపాలైంది.

అసలేమైందంటే:

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధి దొడగట్ట గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఇదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ చౌదరికి సరిగ్గా 9 ఏండ్ల కింద వేరే గ్రామానికి చెందిన సరిత అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి పెండ్లి అయిన రెండేళ్ల తర్వాత పాప పుట్టింది. అంత సవ్యంగానే సాగుతున్న కాపురంలో ప్రభాకర్ చిచ్చు పెట్టాడు.

ఇంతకీ ఈ ప్రభాకర్ ఎవరనుకుంటున్నారా.. దొడగట్ట గ్రామానికి చెందిన ఇతడితోనే సరితకు పరిచయం ఏర్పడింది. భర్త లేని సమయంలో ఇద్దరు కలుసుకునేవారు. ఈ వ్యవహారం ముందు ఇరుగుపొరుగు తెలియడంతో.. వారిద్దరు రహస్యంగా ఉండేదుకు జాగ్రత్త పడ్డా ఎట్టకేలకు భర్త శ్రీనివాస్ చౌదరికి తెలిసింది. దీంతో ఆవేశం కట్టలు తెంచుకున్నప్పటికీ.. భార్య మొండికేసి మాట్లాడటంతో శ్రీనివాస్ మద్యం తాగుడు ప్రారంభించాడు. ఆ తర్వాత తాగిన మత్తులో భార్యతో గొడవకు దిగేవాడు.

శ్రీనివాస్ చౌదరి రోజు మద్యం తాగి వచ్చి గొడవ పడటం భరించలేని సరిత కూడా గొడవకు దిగేది. దీంతో భార్యభర్తలిద్దరి మధ్య గొడవలు మరింత ముదిరాయి. తప్పు చేసి కూడా తన పై దౌర్జన్యం చేస్తోందని భర్త.. తాగొచ్చి గొడవ పడుతున్నాడని భార్య వాదించుకునేవారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి కూడా భర్త తాగొచ్చి గొడవపడడంతో.. కోపంతో సరిత ఓ పప్పు గుత్తిని చేతులోకి తీసుకొని బలంగా తల పై బాది హత్య చేసింది.

భర్త చనిపోయాడని గ్రహించిన సరిత వెంటనే ప్రియుడికి కాల్ చేసింది. ఎలాగైన ఈ హత్య నుంచి తప్పించుకోవాలని ఇద్దరూ పథకం వేసుకున్నారు. దీంతో ఊరిలోని ఓ చెట్టుకు భర్తను ఊరేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ.. ప్రభాకర్-సరిత వివాహేతర సంబంధం శ్రీనివాస్ చౌదరి తండ్రి రామచంద్రప్పకు కూడా తెలుసు. దీంతో ప్రియుడి కోసం తన కొడుకును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రామచంద్రప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి సరిత హత్య చేసిందని గుర్తించారు. అనంతరం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.