క్లాస్ మేట్ తో భార్య ప్రేమాయణం.. భర్త ఫోన్‌లో ఆ వీడియో తీసి..

by  |
crime news
X

దిశ, నేరేడుచర్ల : భార్య‌ మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోందని మనస్థాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న‌‌ సంఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం కొత్త తండాలో వెలుగుచూసింది. ఆత్మహత్యకు ముందు మృతుడు తీసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. వివరాలలోకి వెళితే.. మఠంపల్లి మండలలోని అల్లీపురం గ్రామానికి చెందిన తాళ్ళూరి కాంతాచారి(32) అనే వ్యక్తి రైడో సాండ్ (రాయి నుండి ఇసుక తయారీ )చేసే ఫ్యాక్టరీ‌ నిర్వహిస్తున్నాడు. అతనికి‌ భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక గత కొంతకాలం నుంచి అతని భార్య ఆమెతో కాలేజీ రోజుల్లో చదువుకున్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని, భర్తను, పిల్లలను పట్టించుకోవడం మానేసింది.

ఇక ఈ విషయం తెలుసుకున్న భర్త కాంతాచారి, భార్యను పలుమార్లు మందలించాడు. అయినా సరే భార్య తన పద్దతిని మార్చుకోలేదు. దీంతో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. భార్య మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం తట్టుకోలేని అతను తన భార్య చేసిన ఆగడాలను సెల్ఫీ వీడియోలో తెలిపి.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొదట అతని సెల్ఫీ వీడియో చూసిన బంధువులు కాంతాచారి ఆత్మహత్య చేసుకోకుండా నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చారు. కానీ, బుధవారం అర్ధరాత్రి తన సొంత శాండ్ ఫ్యాకరీలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో కాంతాచారి మాట్లాడుతూ “నా భర్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తూ నన్ను నా ఇద్దరు పిల్లలను నా తల్లిదండ్రులను మోసం చేస్తూ నన్ను ఎన్నో బాధలకు గురి చేస్తుందని పేర్కొన్నారు. నాకు పెళ్లయిన 8 సంత్సరాలలో ఏ రోజు నాతో సఖ్యతగా లేదని నన్ను ఎన్నో బాధలకు గురి చేసి నా బతుకుకి అర్ధం లేకుండా చేసిందన్నాడు. నేను ఎన్నో గొప్పగొప్ప విజయాలు సాధించానని కానీ నా భార్య మనస్సును గెలుచుకోలేకపోయానని వివరించాడు.

నా భార్య పదే పదే నన్ను మోసం చేస్తూ వచ్చిందని నా భార్య ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పెండ్రిపోలు గ్రామానికి చెందిన భద్ర అనే వ్యక్తితో కాలేజీలో చదువుకునే రోజుల్లో పరిచయం ఏర్పడిన వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తుందన్నాడు. పెళ్లయిన ఎనిమిది సంవత్సరాలలో ఏ రోజు నాతో గాని నా ఇద్దరు పిల్లలతో గానీ ఏనాడూ ప్రేమగా లేదని భర్త పిల్లల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని వివరించారు. ఆమె పెట్టే బాధలు కష్టాలు భరించలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు వివరించాడు. నా ఆస్తులకు నా తల్లిదండ్రులు ఇష్టం మేరకే నా పిల్లలకు నా చెల్లెలు పిల్లలకు చెందేలా చూడాలని” ఆ వీడియోలో పేర్కొన్నాడు.



Next Story