- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎందుకు? భయమెందుకు?….
<p>ప్రతిరోజూ ప్రభాతవేళ పక్కా ప్రణాళికతో పదిమెట్లు “ఎక్కడం” మేలు లక్కీగా చిక్కిన వర్క్ ఫ్రం హోం టైంలో వీలుచూసుకుని సైకిల్ “త్రొక్కడం” మేలు నాలుగు రోజులు కరోనాకు చిక్కకుండా ఎక్కడైనా “నక్కడం” మేలు కరోనాను ఖతం చెయ్యమని ఆ ముక్కోటి దేవతలకు “మ్రొక్కడం” మేలు ఎందుకు? భయమెందుకు? “ఆశే” శ్వాసగా సాగిపో ముందుకు… ఎందుకు? భయమెందుకు? “సాహసమే” ఊపిరిగా సాగిపో ముందుకు… ఎందుకు ? భయమెందుకు? “దైర్యమే” ఆయుధంగా అడుగులెయ్ ముందుకు… భయపడితే బ్రతకలేము, భయపడితే మన […]</p>

X
ప్రతిరోజూ ప్రభాతవేళ
పక్కా ప్రణాళికతో పదిమెట్లు “ఎక్కడం” మేలు
లక్కీగా చిక్కిన వర్క్ ఫ్రం హోం టైంలో
వీలుచూసుకుని సైకిల్ “త్రొక్కడం” మేలు
నాలుగు రోజులు కరోనాకు
చిక్కకుండా ఎక్కడైనా “నక్కడం” మేలు
కరోనాను ఖతం చెయ్యమని
ఆ ముక్కోటి దేవతలకు “మ్రొక్కడం” మేలు
ఎందుకు? భయమెందుకు?
“ఆశే” శ్వాసగా సాగిపో ముందుకు…
ఎందుకు? భయమెందుకు?
“సాహసమే” ఊపిరిగా సాగిపో ముందుకు…
ఎందుకు ? భయమెందుకు?
“దైర్యమే” ఆయుధంగా అడుగులెయ్ ముందుకు…
భయపడితే బ్రతకలేము, భయపడితే మన వెనుకే
వెంటాడే పులులుంటాయి,వేటాడే సింహాలుంటాయి
కరోనాలాంటి తరిమే తోడేళ్ళుంటాయి తస్మాత్ జాగ్రత్త
భయపడే పిరికి పందకు ప్రతిరోజు మరణమే
ధైర్యవంతుడికి బుద్దిశాలికి మరణంమాత్రం ఒక్కసారే
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
హైదరాబాద్ – 9110784502
Email. [email protected]
Address.Attapur. Hyderabad.48
Next Story






