అక్కడ డెల్టా వేరియంట్ విశ్వరూపం.. ఎక్కువ బాధితులు వారేనట

by  |
అక్కడ డెల్టా వేరియంట్ విశ్వరూపం.. ఎక్కువ బాధితులు వారేనట
X

జెనీవా: మధ్య ఆసియాలో డెల్టా వేరియంట్ విశ్వరూపం చూపిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. డెల్టా కారణంగా కేసులు భారీగా పెరిగాయని, ప్రస్తుతం ఈ రీజియన్‌లో ఫోర్త్ వేవ్ విజృంభణ కొనసాగుతున్నదని వివరించింది. మొరాకో నుంచి పాకిస్తాన్ వరకూ విస్తరించిన ఉన్న ఈ రీజియన్‌లోని మొత్తం 22 దేశాల్లో కనీసం 15 దేశాల్లో డెల్టా వేరియంట్ ప్రబలంగా కనిపిస్తున్నదని పేర్కొంది. ఫలితంగా అత్యధిక కేసులు, మరణాలు సంభవిస్తున్నాయని ఓ ప్రకటనలో వెల్లడించింది.

కరోనా బారినపడుతున్న చాలా మందిలో టీకా తీసుకోనివారే ఉన్నారని వివరించింది. ఈ రీజియన్ మొత్తంగా టీకా పంపిణీ నెమ్మదిగా సాగుతున్నదని తెలిపింది. గతనెల గణాంకాలను అంతకుముందటి నెలతో పోలిస్తే డెల్టా విజృంభణ స్పష్టమవుతుందని పేర్కొంది. కరోనా కొత్త కేసులు 55శాతం, కరోనా మరణాలు 15శాతం పెరిగాయని వివరించింది. వారానికి 3.10 లక్షల కొత్త కేసులు, 3,500 మరణాలు రిపోర్ట్ అవుతున్నాయని తెలిపింది.


Next Story