థర్డ్‌ వేవ్‌పై సంచలన విషయాలు చెప్పిన WHO

by  |
WHO about corona
X

జెనీవా: కరోనా వైరస్ డెల్టా వేరియంట్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నదని, 111పైగా దేశాల్లో ఈ వేరియంట్ ప్రాబల్యం కనిపిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. ‘దురదృష్టవశాత్తు, మనమంతా ఇప్పుడు మూడో వేవ్ ముంగిట్లో ఉన్నాం’ అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ వివరించారు. కరోనా వైరస్ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందే లక్షణాన్ని కలిగి ఉండటం మూలంగా మరింత ప్రమాదకర, మరింత వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదముందని హెచ్చరించారు.

టీకా సమనత్వాన్ని పాటించాలని ప్రపంచదేశాలను కోరారు. ఒక దేశం మెజార్టీ పౌరులకు రెండు డోసుల టీకాలు వేసి మూడో డోసు బూస్టర్ షాట్ కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తుంటే మరో దేశం ఇంకా వ్యాక్సినేషన్ ప్రారంభించని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. కొన్ని దేశాలు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఆంక్షలు ఎత్తేస్తుంటే మరి కొన్ని దేశాలు టీకాలు పొందే వీలు లేక చేతులెత్తేశాయని పేర్కొన్నారు. ఇది అసంబద్ధమని వివరించారు. ప్రపంచమంతా వైరస్ లేదంటే సేఫ్ అని, ఏ ఒక్క చోటా ఉన్నా అన్ని దేశాలకూ అది ముప్పేనని నొక్కిచెప్పారు.

ప్రతిదేశం సెప్టెంబర్‌లోగా తమ జనాభాలో కనీసం 10శాతం మందికి, ఈ ఏడాది చివరినాటికి 40శాతం మందికి, వచ్చే ఏడాది సగం ముగిసేసరికి 70శాతం మందికి టీకాలు వేసే లక్ష్యాలను పెట్టుకోవాలని సూచించారు. కరోనాను తుదముట్టించడానికి టీకాలే ఏకైక అస్త్రం కాదనీ, ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని, వ్యాప్తిని నియంత్రించాలని, ఆరోగ్య మౌలికవసతులను పటిష్టం చేసుకోవాలని తెలిపారు.


Next Story

Most Viewed