- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కష్టపడి ఎదిగిన నన్ను తక్కువ చేయడానికి మీరెవరు..? తనను ఆంటీ అన్నవారికి వార్నింగ్ ఇచ్చిన అనసూయ
మహిళలను వయసును బట్టి తక్కువ చేయడం, హేళన చేయడం సభ్య సమాజం లక్షణం కాదు. అలా చేస్తున్న వారిని చూసి సమాజం సిగ్గుపడాలి.

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషనల్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. తనపై వచ్చే విమర్శలను ఏమాత్రం సహించని ఆమె, ఈసారి తనను వయసు పేరుతో వేధించే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హోలీ సంబరాల్లో కొందరు ఆకతాయిలు ఆమెను ‘ఆంటీ’ అని పిలుస్తూ వెక్కిరించిన వీడియో వైరల్ కావడంతో ఈ రచ్చ మొదలైంది. ఈ వేధింపులపై స్పందిస్తూ అనసూయ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘ఒకరిని బాధపెట్టి ఆనందం పొందే వికృత మనస్తత్వం ఉన్నవారిని చూస్తుంటే జాలి వేస్తోంది. మహిళలను వయసును బట్టి తక్కువ చేయడం, హేళన చేయడం సభ్య సమాజం లక్షణం కాదు. అలా చేస్తున్న వారిని చూసి సమాజం సిగ్గుపడాలి. అందరూ నాకెందుకులే అని ఇలాంటి వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే, మనం మానవత్వాన్ని పూర్తిగా కోల్పోతాం.
నేను ఎప్పుడూ ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను, ఎవరికీ భయపడను’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. విమర్శించే వారిని నిలదీస్తూ.. ‘‘ఎన్నో అడ్డంకులు, అవమానాలను తట్టుకుని ఈ స్థాయికి వచ్చాను. నా ప్రయాణం, నా సక్సెస్ నాకు గర్వకారణం. కష్టపడి పైకి వస్తున్న వారిని తక్కువ చేయడానికి మీరెవరు?’’ అంటూ ట్రోలర్ల దుమ్ము దులిపేశారు. సెలబ్రిటీ హోదాలో ఉన్నా కూడా, తనపై జరుగుతున్న బాడీ షేమింగ్, ఏజ్ షేమింగ్‌ను ఆమె ధీటుగా ఎదుర్కోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలకు మహిళా అభిమానుల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. కేవలం సెలబ్రిటీలనే కాదు, సామాన్య మహిళలను కూడా ఇలాంటి మాటలతో వేధించే వారికి ఇది ఒక గుణపాఠం కావాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అనసూయకు ఘోర అవమానం.."ఆంటీ ఆంటీ" అంటూ !






