- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనసూయకు ఘోర అవమానం.."ఆంటీ ఆంటీ" అంటూ !
హోలీ వేడుకల్లో పాల్గొన్న అనసూయను ఉద్దేశించి.. ఆంటీ.. ఆంటీ అంటూ రెచ్చిపోయారు కొంతమంది యువకులు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ యాంకర్, ప్రముఖ నటి అనసూయ ( Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో యాంకర్ గా ఇరగదీసిన అనసూయ భరద్వాజ్, ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకు వెళ్తోంది. జబర్దస్త్ లాంటి కామెడీ షో లో దాదాపు పది సంవత్సరాల పాటు యాంకర్ గా పనిచేసి, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కష్టానికి తగ్గట్టుగానే ఇప్పుడు సినిమాలలో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాలలో ప్రత్యేక పాత్రలో అనసూయ కనిపిస్తున్నారు. రంగమ్మత్త లాంటి పాత్రలు కూడా చేసి ఇండస్ట్రీని షేక్ చేశారు అనసూయ. ఇటు పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాల్లో కూడా ఇరగదీశారు. అయితే అలాంటి అనసూయకు ఘోర అవమానం ఎదురైంది. ఆమె ఓ ఈవెంట్ కు వెళితే ఆంటీ.. ఆంటీ అంటూ రచ్చ చేశారు కొంత మంది యువత. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
యాంకర్ అనసూయకు ఘోర అవమానం
టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కు ఊహించని పరిణామం ఎదురయింది. హైదరాబాద్ లో జరిగిన హోలీ వేడుకల్లో (holi celebrations) తాజాగా అనసూయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను మాట్లాడకుండా కొంతమంది ఆకతాయిలు అడ్డు తగిలారు. మైక్ అందుకున్న అనసూయను ( Anasuya ) ఉద్దేశించి.. ఆంటీ.. ఆంటీ ( aunty chants ) అంటూ రెచ్చిపోయారు కొంతమంది యువకులు. అంతలా వాళ్లు ఏడిపించినప్పటికీ.. బాధను దిగ మింగుకొని హోలీ శుభాకాంక్షలు చెప్పారు అనసూయ భరద్వాజ్. గత సంవత్సరం హోలీ సందర్భంగా కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది. కానీ అప్పుడు ఆమె రియాక్షన్ చాలా హార్డ్ గా ఉంది. ఆంటీ అని ఓ వ్యక్తి పిలవడంతో దమ్ముంటే స్టేజ్ పైకి రండి అంటూ రచ్చ చేసింది అనసూయ. కానీ ఈసారి మాత్రం నవ్వుతూ శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోయింది.






