దివాళా తీసిన బిగ్ బీ.. ఆ నిర్మాత దగ్గర జాబ్ అడుక్కున్నాడట!

by  |
Amithab
X

దిశ, సినిమా : బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 1990లో ABCL బిజినెస్ వెంచర్ స్టార్ట్ చేశాడు. అయితే కొద్దిరోజుల్లోనే ఆ వ్యాపారం ఫెయిల్ కావడంతో దివాళా తీశాడు. ఏంచేయాలో తోచని పరిస్థితుల్లో ఫిల్మ్ మేకర్ యశ్ చోప్రా దగ్గరకు వెళ్లిన బచ్చన్ జీ.. తనకు పని ఇప్పించాలని కోరాడట. ఈ విషయంలో సరిగ్గా ఆలోచించిన యశ్ చోప్రా.. బిగ్ బీకి విలువైన సూచనలు అందించారట. మళ్లీ యాక్టింగ్‌నే ఆయుధంగా చేసుకుని ముందుకు సాగాలని సూచించారట. అయితే అప్పటికే తను చేసిన మూవీస్ వరుసగా ఫెయిల్ అవుతుండటంతో.. తను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నానో ఆలోచించాడట. ఈ క్రమంలోనే యశ్ చోప్రా కుమారుడు ఆదిత్య చోప్రా డైరెక్షన్‌లో ‘మొహబ్బతే’ సినిమా చేసిన బిగ్ బీ.. ఆ తర్వాత ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ షోకు హోస్ట్‌గా అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదని బిగ్ బీ కొడుకు అభిషేక్ బచ్చన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.


Next Story