వాట్సాప్‌ న్యూ ఫీచర్స్.. బయోమెట్రిక్, ఐ, ఫేస్ రికగ్నిషన్

by  |
వాట్సాప్‌ న్యూ ఫీచర్స్.. బయోమెట్రిక్, ఐ, ఫేస్ రికగ్నిషన్
X

దిశ, ఫీచర్స్: ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ యాప్ 2 బిలియన్లకు పైగా వినియోగదారులతో తిరుగులేని సంస్థగా పేరు తెచ్చుకుంటున్న తరుణంలో, వాట్సాప్ తీసుకున్న ‘ప్రైవసీ పాలసీ’ నిర్ణయం..ఆ సంస్థకు ఊహించని షాక్ ఇచ్చి వార్తల్లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడం, వినియోగదారులను ఆగ్రహంతో పాటు, భారీగా కస్టమర్లను కోల్పోయింది. దాంతో దిగొచ్చిన వాట్సాప్ బిజినెస్ ఖాతాల సమాచారాన్ని మాత్రమే పంచుకుంటామని వివరణ ఇచ్చినా విమర్శలు తగ్గలేదు. దీంతో ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గిన వాట్సాప్.. నిర్ణయాన్ని మూడు నెలలపాటు వాయిదా వేసింది. అయితే కోల్పోయిన కస్టమర్లను ఆకట్టుకోవడానికో లేదా తమ యాప్ మరింత భద్రతా ప్రమాణాలను తీసుకొస్తుందని చెప్పడానికో కానీ వాట్సాప్ తాజాగా కొత్త ఫీచర్స్ ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్స్ ఏంటంటే..ఫేస్, ఐ రికగ్నిషన్, థంబ్ ప్రింట్ ఆధారంగా వాట్సాప్‌ యాక్సెస్ చేయడానికి వీలు కలుగుతుంది.

డెస్క్‌టాప్ లేదా వెబ్‌లో వాట్సాప్‌ను ఉపయోగించడానికి ఫేస్ రికగ్నషన్ లేదా ఐరిస్ స్కాన్‌, థంబ్ ప్రింట్ ఇక తప్పనిసరి చేస్తూ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది ఇప్పటికే ఉన్న క్యూఆర్ కోడ్ అథెంటికేషన్‌తో పాటు ఉపయోగించబడుతుంది. అంటే ఇది సెకండ్ లేయర్ ఆఫ్ అథెంటికేషన్ అన్నమాట. ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ హ్యాండ్‌సెట్‌లలో ఈ కొత్త ఫీచర్ యాడ్ చేసుకుని, బయోమెట్రిక్ ప్రామాణీకరణలను ప్రారంభించినప్పుడే ఇది పనిచేస్తుంది. ఒకవేళ బయోమెట్రిక్ చేసుకోకపోతే, యాప్‌లోకి యాక్సెస్ చేయలేరు. ఫేస్ రికగ్నషన్, వేలిముద్రలు, ఐరిస్ స్కానింగ్ డేటాను ఎట్టిపరిస్థితుల్లో తాము ఉపయోగించుకోబోమని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది.

Next Story

Most Viewed