వాట్సాప్‌లో లాస్ట్ సీన్ కనిపించనిది అందుకే!

by Harish |

<p>ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌.. టెక్నికల్ ఎర్రర్స్ కారణంగా కాసేపు డౌన్ అయింది. సెక్యూరిటీ సెట్టింగ్‌లో వినియోగదారుల లాస్ట్ సీన్, టైపింగ్, ఆన్‌లైన్‌ వంటి ఫీచర్స్ కనిపించకుండా పోయాయి. అలాగే &#8216;ప్రైవసీ సెట్టింగ్స్&#8217;, &#8216;సెక్యూరిటీ సెట్టింగ్స్&#8217; కూడా పనిచేయలేదు. దీంతో యూజర్లకు వాట్సాప్‌లో ‘లాస్ట్ సీన్’ను చేంజ్ చేసుకునే అవకాశం లేకుండాపోయింది. వాట్సాప్ యూజర్ల అప్లికేషన్ సెట్టింగ్స్‌లో ఒక బగ్ కారణంగా సాంకేతిక సమస్య తలెత్తినట్లు ‘డౌన్ డిటెక్టర్’ అనే వెబ్‌సైట్ పేర్కొంది. దీంతో తమ ఫోన్లలో [&hellip;]</p>

వాట్సాప్‌లో లాస్ట్ సీన్ కనిపించనిది అందుకే!
X

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌.. టెక్నికల్ ఎర్రర్స్ కారణంగా కాసేపు డౌన్ అయింది. సెక్యూరిటీ సెట్టింగ్‌లో వినియోగదారుల లాస్ట్ సీన్, టైపింగ్, ఆన్‌లైన్‌ వంటి ఫీచర్స్ కనిపించకుండా పోయాయి. అలాగే ‘ప్రైవసీ సెట్టింగ్స్’, ‘సెక్యూరిటీ సెట్టింగ్స్’ కూడా పనిచేయలేదు. దీంతో యూజర్లకు వాట్సాప్‌లో ‘లాస్ట్ సీన్’ను చేంజ్ చేసుకునే అవకాశం లేకుండాపోయింది.

వాట్సాప్ యూజర్ల అప్లికేషన్ సెట్టింగ్స్‌లో ఒక బగ్ కారణంగా సాంకేతిక సమస్య తలెత్తినట్లు ‘డౌన్ డిటెక్టర్’ అనే వెబ్‌సైట్ పేర్కొంది. దీంతో తమ ఫోన్లలో సీన్ సెట్టింగ్స్‌ను మార్చడంలో 67 శాతం వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఫిర్యాదు చేయగా, 26 శాతం వినియోగదారులు కనెక్షన్ సమస్య, 6 శాతం మందికి లాగిన్ ఇబ్బందులొచ్చాయని ఫిర్యాదు చేశారు. ఇండియా సహా అమెరికా, యూకే, యూరప్, సింగపూర్‌లో ఈ సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో చాలామంది ట్విట్టర్‌ ద్వారా కంప్లయిట్స్ చేయడం గమనార్హం.

Next Story