IPO ల భవిష్యత్తు ఏమిటి ..?

by  |
IPO FUTURE
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కొత్త వేరియంట్ వలన స్టాక్ మార్కెట్‌లు వరుసగా కుప్పకూలుతున్నాయి. దేశంలో మరోసారి లాక్‌డౌన్ రావచ్చనే ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్స్ అమ్మకానికి సిద్దపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వలన మార్కెట్‌లోకి కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. 2021లో మార్కెట్‌లోకి చాలా కంపెనీలు ipo (ప్రారంభ పబ్లిక్ ఆఫర్) ద్వారా అడుగుపెట్టాయి. అందులో ఒకటి రెండు సంస్థలు మినహ చాలా వరకు సక్సెస్ అయ్యాయి. కానీ కరోనా కొత్త వేరియంట్ మూలాన రాబోయే IPO ల భవిష్యత్తు ఎలా ఉంటుందని ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ IPOను వాయిదా వేసుకున్నాయి. కానీ కొన్ని కంపెనీలు ధైర్యంగా ipoకు సిద్ధమవుతున్నాయి.

ఇప్పటికే TEGA INDUSTRIES, STARHEALTH సంస్థలు వచ్చే వారం మార్కెట్‌లో తమ అదృష్టాన్ని పరిక్షించుకొనున్నాయి. అదే బాటలో డిసెంబర్ నెలలో రెండు కంపెనీలు ప్రారంభ పబ్లిక్ ఆఫర్ కు రానున్నాయి.

ట్రావెల్ టెక్నాలజిస్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన RATEGAIN ట్రావెల్ టెక్నాలజిస్ డిసెంబర్ 8న తన మొదటి ipo సబ్స్క్రిప్షన్ ను ప్రారంభించింది. సబ్స్క్రిప్షన్ చివరి తేదీ డిసెంబర్ 9. ఇష్యూ ధర రూ.405-రూ.425. ఈ ipo ద్వారా కంపెనీ రూ.1,335.7 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. RATEGAIN ట్రావెల్ కంపెనీ హోటళ్ళు, ఎయిర్ లైన్‌లు, కార్ రెంటర్స్ వంటి సేవలను నిర్వహిస్తుంది.

దక్షిణ భారతదేశంలోని రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ సంస్థ శ్రీరామ్ ప్రాపర్టీస్ డిసెంబర్ 8న ipo ను ప్రారంభించబోతుంది. ipo చివరి తేదీ డిసెంబర్ 10. ఇష్యూ ధర రూ.113-రూ.118 గా నిర్ణయించారు. కంపెనీ ఈ ఇష్యూ ద్వారా రూ.600 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కంపెనీ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఉంది. కోయంబత్తుర్, విశాఖపట్నం, కోల్‌కతా ఏరియాలలో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

కరోనా ఎఫెక్ట్ వలన ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్ భయంతో మార్కెట్ నష్టాల్లోకి వెళ్తుంది. మరి ఇలాంటి సమయంలో కొత్త IPO ల భవిష్యత్తు ఎలా ఉంటుందనేది మార్కెట్ విశ్లేషకులకు ఒక ప్రశ్నగా ఉంది. రాబోయే కాలంలో ఈ IPO లు లాభపడుతాయా లేక నష్ట పొతాయో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.


Next Story

Most Viewed