వర్మ కంట్లో కన్నీరు.. ‘అమ్మాయి’ కోసం ఎమోషనల్ (వీడియో)

by  |
వర్మ కంట్లో కన్నీరు.. ‘అమ్మాయి’ కోసం ఎమోషనల్ (వీడియో)
X

దిశ, సినిమా : రామ్ గోపాల్ వర్మ రీసెంట్ ఫిల్మ్ ‘అమ్మాయి’ తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రమని తెలిపారు. ఇండియాలో మొదటి మార్షల్ ఆర్ట్స్‌ మూవీ ఇదే కాగా.. పూజ భలేకర్ టైటిల్ రోల్ పోషించింది.అయితే ఎలాంటి సినిమాకైనా డిఫరెంట్ ప్రమోషన్ స్ట్రాటజీతో సెన్సేషన్ సృష్టించే వర్మ.. ‘అమ్మాయి’పై ఇంకాస్త స్పెషల్‌గా కాన్సంట్రేట్ చేశాడు. ఫేమస్ మార్షల్ ఆర్టిస్ట్ కమ్ యాక్టర్ ‘బ్రూస్ లీ’కి ఈ సినిమాను డెడికేట్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించిన ఆర్జీవీ.. అతని 81వ జయంతి సందర్భంగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై ‘అమ్మాయి’ ట్రెలర్‌ను ప్రదర్శించి ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఊహించని విధంగా భావోద్వేగానికి గురయ్యాడు.

‘నేను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘అమ్మాయి’ చిత్ర ట్రైలర్‌ను ప్రపంచంలోనే ఎత్తయిన స్క్రీన్‌పై చూడటం నా కెరీర్‌లోనే బెస్ట్ థ్రిల్లింగ్ మూమెంట్’ అంటూ కన్నీరు పెడుతున్న ఎమోజీస్ పోస్టు చేశాడు. దీనిపై భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు ‘ఊకో.. వర్మ మావా! నువ్వు కూడా ఎమోషనల్‌‌గా ఏడుస్తుంటే చూసేందుకు సిగ్గుగా ఉంది’ అంటున్నారు. ‘నిజం చెప్పు వర్మ.. అవి ఆనంద భాష్పాలా? లేదా వోడ్కా భాష్పాలా?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఆర్ట్ సీ మీడియా, చైనా కంపెనీ బిగ్ పీపుల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవనుంది.



Next Story