వివాదంలో చిక్కుకున్న కలెక్టర్.. ‘యూజ్ లెస్ ఫెలోస్’ ఇలాగేనా అంటూ..?

by  |
వివాదంలో చిక్కుకున్న కలెక్టర్.. ‘యూజ్ లెస్ ఫెలోస్’ ఇలాగేనా అంటూ..?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ మిశ్రా తహసీల్దార్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై రెవెన్యూ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘యూజ్ లెస్ ఫెలోస్’ఇలాగేనా పని చేసేది అంటూ పలువురు తహసీల్దార్లపై తిట్ల పురాణం ప్రారంభించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ టెలికాన్ఫరెన్స్ సమావేశంలో భాగంగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం.

అంతేకాకుండా సస్పెండ్ చేస్తానంటూ పలువురు ఎమ్మార్వోలను హెచ్చరించారు.దీనికి సంబంధించిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత తహసీల్దార్ల సంఘం నేతలు కలెక్టర్‌ను కలసి వివరణ కోరగా.. మనమందరం ఒకే కుటుంబంగా భావించే ఈ విధంగా కామెంట్స్ చేసినట్టు కలెక్టర్ వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.



Next Story

Most Viewed