- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షారుక్ ఫ్యామిలీ ఎలాంటిదో మాకు తెలుసు.. ట్విట్టర్‌లో ఫ్యాన్స్ పోస్ట్ వైరల్
<p>దిశ, సినిమా : రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న పక్కా సమాచారంతో ముంబై, క్రూయిజ్ షిప్‌లో దాడి చేసిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(NCB).. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ సహా ఎనిమిది మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఎన్‌సీబీ కస్టడీలో ఉన్నఈ స్టార్ కిడ్ ఓ రోజు విచారణ తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, కొట్టి వేసిన కోర్టు కస్టడీని అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఈ తరుణంలో […]</p>

దిశ, సినిమా : రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న పక్కా సమాచారంతో ముంబై, క్రూయిజ్ షిప్‌లో దాడి చేసిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(NCB).. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ సహా ఎనిమిది మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఎన్‌సీబీ కస్టడీలో ఉన్నఈ స్టార్ కిడ్ ఓ రోజు విచారణ తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, కొట్టి వేసిన కోర్టు కస్టడీని అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఈ తరుణంలో ఆయన షారుక్ ఫ్యాన్స్ ఆయన కుటుంబానికి, కొడుకు ఆర్యన్‌కి మద్దతు నిలుస్తున్నారు. ఎంతోమంది అభిమానులు షారుక్ మేము మీతో ఉన్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో ట్విట్టర్‌లో #WeStandWithSRK ట్రెండింగ్‌లోకి రాగా..‘ SRK మీది అందమైన కుటుంబం. మీ పిల్లలు చాలా మంచివారు. మీ పద్ధతుల గురించి మాకు తెలుసు. మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాం’ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అలాగే బాలీవుడ్ ప్రముఖులు సైతం షారుక్ కుటుంబానికి మద్దతు తెలిపారు. ఈ తరుణంలో ఆర్యన్ గతంలో చిన్నారికి డబ్బులు దానం చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
#WeStandWithSRK #SRKPRIDEOFINDIA
We all stand with SRK sir and his beautiful family his amazing kids and wonderful wife
God bless you all Ameen O God 🙏#ShahRukhKhan pic.twitter.com/Hs0Zp2hRx9— 🇪🇬Nahla SRK (@NahlaEl99258710) October 3, 2021






