కరోనాకు వైసీపీ నేత బలి

39

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజూ దాదాపు 10 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాజకీయ, క్రీడా ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. మరికొంత మంది ప్రముఖలు కరోనా నుంచి కోలుకోలేక మృత్యువాత పడుతున్నారు. తాజాగా వైసీపీ నేత కరోనా రక్కసికి బలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని కుమార దేవం గ్రామానికి చెందిన ఏఎంసీ ఛైర్మన్ యాండపల్లి రమేష్ కరోనా నుంచి కోలుకోలేక మృతి చెందాడు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.