బెంగాల్, అసోంలలో కొనసాగుతున్న పోలింగ్.. పోటెత్తుతున్న ఓటర్లు

by  |
bengal, assam first phase polling
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమబెంగాల్, అసోంలో తొలి విడత ఎన్నికల ప్రక్రియ చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 11 గంటల నాటికి అసోంలో 24.48 శాతం, బెంగాల్‌లో 24.61 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూనే ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రెండు రాష్ట్రాలలోనూ పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తుండటంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక హైఓల్జేజ్ రేంజ్‌లో జరుగుతున్న బెంగాల్ ఎన్నికలలో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో తొలి దశ పోలింగ్ కొనసాగుతున్నది. ఓటింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా భగవాన్‌పూర్ నియోజవకర్గ పరిధిలోని సత్‌సత్‌మల్ పోలింగ్ కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు సెక్యూరిటీ అధికారులపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. అసోంలో సీఎం సర్బనంద సొనొవాల, కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.


Next Story

Most Viewed