- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీసీఎంలో భారీగా గంజాయి..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రంలో భారీగా గంజాయి పట్టుబడింది. శనివారం ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా సుమారు 100 కిలోల గంజాయి పట్టుబడింది. వయనాడ్‌లోని తోల్‌పెట్టి చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ అధికారులు రోజుమాదిరిగానే తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ డీసీఎం అనుమానాస్పదంగా వస్తుండటాన్ని గమనించిన అధికారులు దానిని ఆపారు. అనంతరం చెక్ చేయగా అందులో 100కిలోల గంజాయి లభ్యమైంది. మొత్తం 4సంచుల్లో తరలిస్తున్న గంజాయిని సీజ్ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రంలో భారీగా గంజాయి పట్టుబడింది. శనివారం ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా సుమారు 100 కిలోల గంజాయి పట్టుబడింది. వయనాడ్‌లోని తోల్‌పెట్టి చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ అధికారులు రోజుమాదిరిగానే తనిఖీలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఓ డీసీఎం అనుమానాస్పదంగా వస్తుండటాన్ని గమనించిన అధికారులు దానిని ఆపారు. అనంతరం చెక్ చేయగా అందులో 100కిలోల గంజాయి లభ్యమైంది. మొత్తం 4సంచుల్లో తరలిస్తున్న గంజాయిని సీజ్ చేశారు.
గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, ఆ వాహనాన్ని కూడా సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఆ గంజాయిని ఎక్కడి నుంచి తెచ్చి, ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు.
Next Story






