కుదిరితే ఈ రాశి వ్యాపారులు అవి వాయిదా వేసుకోండి

437
Panchangam

తేది : 1, సెప్టెంబర్ 2021
ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : బుధవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : దశమి
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 24 ని॥ నుంచి
మర్నాడు ఉదయం 6 గం॥ 22 ని॥ వరకు)
నక్షత్రం : మృగశిర
(నిన్న ఉదయం 9 గం॥ 44 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 12 గం॥ 32 ని॥ వరకు)
యోగము : వజ్రము
కరణం : గరజ
వర్జ్యం : (ఈరోజు రాత్రి 9 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 31 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 29 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 51 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 40 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 16 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 49 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు ఉదయం)

మేష రాశి: ధైర్యము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. నిజాయితీగా ప్రయత్నించండి విజయం మీదే. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి ముఖ్యంగా మీ పిల్లలతో గడపటం మీకు ఎంతో ఎనర్జీ. ఆఫీసు పనులలో కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. దైవ దర్శనం వలన మానసిక ప్రశాంతత. వ్యాపారులు ఎవ్వరితోనూ వాదోపవాదాలకు దిగకండి దానివలన లాభం లేదు. ఆదాయం బాగుంది అనవసరపు ఖర్చులను నివారించండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు అధిక శ్రమ వలన తలనొప్పి. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

వృషభ రాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి ముఖ్యంగా చల్లటి పదార్థాలను సేవించవద్దు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి ఆఫీసులో తోటి ఉద్యోగులతో సామరస్యంగా ప్రవర్తించండి. అదనపు బాధ్యతల వలన పనులను సకాలంలో పూర్తి చేయలేకపోతారు ప్రయత్నించండి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం పర్వాలేదు. ముఖ్య అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. బయటి తిండి వలన అజీర్తి ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

మిధున రాశి: ఫలితం గురించి ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుపోండి. తోటి ఉద్యోగులతో సామరస్యంగా ప్రవర్తించండి. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక, పట్టుదల అవసరం. వ్యాపారులు కుదిరితే ప్రయాణాలను వాయిదా వేసుకోండి. డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త పడండి. సహనంతో వ్యవహరించండి. దైవ దర్శనం వలన మానసిక ప్రశాంతత. కుటుంబ సభ్యుల కోసం కొంత సమయం కేటాయించండి వారితో పరుషంగా మాట్లాడకండి. ఆదాయం పర్వాలేదు అనవసరపు ఖర్చులను నివారించండి. బయటి తిండి వలన అజీర్తి. రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.

కర్కాటక రాశి: సహనంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు మీ మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ఆహ్లాదకరమైన సంగీతం వినటం వలన మానసిక ప్రశాంతత. అయోమయం లో ఉన్నప్పుడు సన్నిహితుల సలహా తీసుకోండి. వ్యాపారులకు లాభాలు. ఆదాయం బాగుంది విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. దుబారా ఖర్చులను నివారించండి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ పని నిబద్ధత పై అందరి ప్రశంసలు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు కుటుంబ సమస్యలపై చర్చించుకుంటారు సమస్యల వలన మానసిక శాంతి.

సింహరాశి: ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. ఉమ్మడి కుటుంబం లోని సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు. వీలైతే ప్రయాణాలు వాయిదా వేయండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. సహనంతో పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టట్లేదు టీవీ మొబైల్ వాడకం వల్ల సమయం వృధా చేస్తున్నారు వారిని ఒక కంట గమనించండి. ఆదాయం పర్వాలేదు ఖర్చులు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మరిచిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.

కన్యారాశి: సహనంతో ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి ముఖ్యమైన నిర్ణయాలను మీ పెద్ద వారి సలహాతో తీసుకోండి. తోబుట్టువుల నుంచి ధన సహాయం లభిస్తుంది. ఆఫీసులో పనులను సకాలంలో పెండింగ్ పనుల తో సహా పూర్తి చేస్తారు. వ్యాపారులకు లాభాలు. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. కావలసిన ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. పాజిటివ్ ఆలోచనల వలన మానసిక ప్రశాంతత. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీల కి మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

తులారాశి: సహనము పట్టుదలతో అనుకున్న కార్యాలు సాధిస్తారు ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయాలంటే అధిక సామర్థ్యం అవసరం. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి ముఖ్యంగా పిల్లలతో గడపటం మీకు ఎంతో ఎనర్జీ. డబ్బును పొదుపు చేయటం మరియు సరైన పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ఎంత ఉపయోగమో ఈరోజు తెలుసుకుంటారు. ఆఫీసు పనులలో అధిక శ్రమ. పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితం రొటీన్ గా అనిపించడం వలన మానసిక అశాంతి.

వృశ్చిక రాశి: సహనంతో పట్టుదలతో అనుకున్న కార్యాలు సాధిస్తారు. ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. మనసు ప్రశాంతంగా ఉండడం వలన పాజిటివ్ ఆలోచనలు. పూర్వీకుల ఆస్తి గొడవలు మీకు అనుకూలం. వ్యాపారులు కొత్త పెట్టుబడులను వాయిదా వేయండి. తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆదాయం పర్వాలేదు అనుకోని ఖర్చులు వలన డబ్బుకి ఇబ్బంది. సీజన్ మార్పుల వలన దగ్గు జలుబు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు.

ధనుస్సు రాశి: ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. దైవప్రార్థన వలన మానసిక ప్రశాంతత. ఈరోజు ఆఫీసులో ఫుల్ బిజీ. అధిక శ్రమ వలన పనులు ఆలస్యం అయ్యే అవకాశం. మరింత కష్టపడి పనులు సకాలంలో పూర్తి చెయ్యండి. వ్యాపారులకు డబ్బు ఇబ్బంది వలన పెట్టుబడులు సగంలో ఆగిపోతాయి. పూర్వీకుల ఆస్తి గొడవల వలన కుటుంబ సభ్యుల మధ్య బేధాభిప్రాయాలు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు వలన లాభాలు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల వైవాహిక జీవితంలోకి మూడవ వ్యక్తిని రానీయకండి.

మకర రాశి: పట్టుదల ధైర్యంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. వ్యాపారులకు లాభాలు. మరిన్ని పెట్టుబడులు పెడతారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు పర్మనెంట్ అయ్యే అవకాశం. మీ పని నిబద్ధత పై అందరి ప్రశంసలు. కొంతమంది ఉద్యోగులకు జీతాలు పెరుగుదల. ఆదాయ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. పొదుపు చేయటం వలన మరియు సరైన పథకాల్లో పెట్టుబడులు పెట్టడం వలన ఎంత లాభమో ఈరోజు తెలుసుకుంటారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

కుంభరాశి: సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల వల్ల లాభాలు. ఆఫీసు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆఫీసులో ఆహ్లాదకర వాతావరణం. వ్యాపారులకు వారు కష్టపడిన కొద్దీ లాభాలు. కుటుంబ సభ్యులకు కొంత సమయం గడపండి వారితో గడపడం వలన మీకు ఎంతో ఎనర్జీ. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది సీజన్ మార్పుల వలన దగ్గు జలుబు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

మీన రాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక అవసరం సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి వారితో పరుషంగా మాట్లాడకండి. ముఖ్యంగా మీ పెద్దవారికి గౌరవం ఇవ్వండి. ఆదాయం పరవాలేదు అనుకోని ఖర్చులు వలన డబ్బుకు ఇబ్బంది. నిరుద్యోగులు మీరు ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తుంటే మరింత కష్టపడాలి. వ్యాపారులు మరింత లాభాలు సంపాదించాలనుకుంటే సరైన ప్రణాళికలు వేయండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం మానేసి సామరస్యంగా ఉండటానికి ప్రయత్నించండి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..