బుధవారం పంచాంగము, రాశి ఫలాలు (05-05-2021)

by  |
Panchangam Rasi phalalu
X

తిథి నవమి 13:24:03
క్షత్రము ధనిశ్ఠ 09:11:11
కరణం :
గర 13:24:03
వణిజ 25:44:03
పక్షం కృష్ణ
యోగం బ్రహ్మ 19:35:53
రోజు బుధవారము

సూర్య మరియు చంద్ర లెక్కలు

సూర్యోదయం 05:48:29
చంద్రోదయము 26:30:00
జన్మరాశి కుమ్భ
సూర్యాస్తమయం 18:37:24
చంద్రాస్తమయము 13:28:59
ఋతువు గ్రీష్మ

హిందు మాసము మరియు సంవత్సరము

శక సంవత్ 1943 ప్లవ
కలి సంవత్ 5123
పగటి ప్రమాణము 12:48:55
విక్రమ సంవత్ 2078
అమావస్యాంత మాసము చైత్రం
పూర్ణిమాంత మాసము వైశాఖం

మంగళకర/అమంగళకర సమయం
మంగళకర సమయం
అభిజిత్ ఏదీకాదు
అమంగళకర సమయం
దుర్ముముహూర్తములు 11:47:19 – 12:38:34
కంటక/మృత్యు 16:54:53 – 17:46:09
యమఘంట 08:22:16 – 09:13:31
రాహు కాలము 12:12:57 – 13:49:04
కుళిక 11:47:19 – 12:38:34
కాలవేల 06:39:44 – 07:31:00
యమగండము 07:24:36 – 09:00:43
గుళిక కాలము 10:36:50 – 12:12:57

దిశ శూల
దిశ శూల ఉత్తరం

చంద్ర బలం వాటి తార బలం
తార బలం
భరణి, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వఫల్గుణి, హస్త, చిత్ర, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రావణ, ధనిశ్ఠ, శతభిష, పూర్వభాద్ర, రేవతి
చంద్ర బలం
మేష, వృషభ, సింహ, కన్య, ధనుః, కుమ్భ

రాశి ఫలాలు..

మేష రాశి

ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగస్తులు మరియు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నం చేసే వారికి మంచి సమయం. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. డబ్బు లావాదేవీలలో లాభం కలిగే అవకాశం. ప్రయాణాలు చేసే అవకాశం. రాజకీయాల్లో ఉన్నవారికి వ్యవహారాల్లో చిక్కులు కలిగే అవకాశం. చోరుల మూలంగా ధననష్టం మరియు అకారణ కలహాలు కలుగవచ్చు

వృషభ రాశి

అకారణ భయం, లేనిపోని చిక్కులు, ఊహల వల్ల రోగము వచ్చిందేమో అన్న అనుమానం. వీటి వలన ధన వ్యయము అయ్యే అవకాశం. కావలసిన పనులకోసం శ్రమ పడవలసి ఉంటుంది. శత్రువులు వీరిపై అనుకున్న వృద్ధిని సాధించే అవకాశం ఉన్నది. భార్య/ భర్త మూలంగా అనుకోని ఖర్చు ఉండవచ్చు.

మిథునం

ప్రభుత్వం నుంచి రావాల్సిన ధనము చేతికి అందుతుంది. అలాగే ప్రభుత్వం నుండి చిక్కులు రావచ్చనే భయాలు కలుగుతాయి. దాని వలన విచారము కలిగే అవకాశం. వాహనాల వలన మరియు స్త్రీల మూలకంగా హాని, కష్టము కలిగే అవకాశం. సౌఖ్యమైన జీవితం మరియు భూమి కొనుగోలు చేసే అవకాశం, ధనలాభం ఉన్నది. ఇష్టమైన వస్తువులను ఉత్సాహంగా కొనుగోలు చేస్తారు.

కర్కాటకం

స్త్రీల మూలకంగా ధనలాభం కలుగుతుంది. సోదరులు వలన ఆనందాన్ని పొందుతారు. విశేష ధనలాభం ఉన్నా కూడా దానికి తగ్గట్టు ధనవ్యయం కూడా ఉన్నది. సంతానం వారిని మరియు వృత్తిలో కష్టాలు అయినా కూడా అనుకున్న కార్యాలలో విజయం సాధిస్తారు. భార్య/భర్త యొక్క ఆరోగ్య విషయంగా విచారము, ధనవ్యయము మరియు మృత్యు భయము

సింహ రాశి

విశేషం ధన ప్రాప్తి, సంతోషము, అలసట మరియు త్రిప్పి పూలతో కూడిన దూరప్రయాణాలకు అవకాశం. పరాయి వ్యక్తుల వలన గౌరవం నష్టము మరియు దాని వ్యయము. భార్య/భర్త మూలకంగా సౌఖ్యము మరియు ధనప్రాప్తికి అవకాశం.

కన్యా రాశి

ధన లాభం మరియు ధాన్య వృద్ధి. సోదరుల వలన సంతోషం ఉంటుంది. సర్వ సంపదలకు అవకాశం. చదువులో ఆటంకాలు. భార్య లేదా భర్త మూలకంగా నానా విధ విచారాలు. రోగం వలన ధన వ్యయం అగుటకు అవకాశం. విష్ణు మూర్తిని ప్రార్థించుట వలన ఉపశమనం.

తుల రాశి

సర్వ సంపదలు లభిస్తాయి. కార్య హాని జరిగే అవకాశాలు ఉన్నాయి. భూమిని కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర సంబంధమైన రోగాలకు అవకాశం. చోర మూలంగా ధన నష్టమునకు మరియు భయమునకు అవకాశం. అనుకున్న విధంగా లాభాలు రాక పోవచ్చు. దూర ప్రయాణాలు మరియు పై చదువులకు వెళ్ళాలనే కోరికలు నెరవేరుతాయి.

వృశ్చకరాశి

శత్రువుల వలన లేని పోని భయాలు కలుగుతాయి. ధన లాభం ఉండి. మానసికంగా అతిగా ఆలోచించటం వలన రోగ భయం మరియు దాని వలన అనవసర ఖర్చులు ఉంటాయి. వృత్తిలో శత్రువుల మీద విజయం ఉంటుంది. ఇనుప వస్తువులు మరియు శస్త్రాల వల్ల భాధ కలుగుతుంది.

ధనస్సు రాశి

ధనలాభం ఉంది. కుటుంబంలోని వ్యక్తుల వలన హాని. వాహనాల వలన మరియుచదువుల కొరకై ఖర్చు పెడతారు. విందు వినోదాలు మరియు పిల్లల కొరకై చేసే పనులలో ఆటంకాలు ఉంటాయి. శత్రువులపై మరియు కోర్టు కేసులలో విజయం. కొత్త బట్టలు మరియు నగలు కొనుగోలు చేస్తారు.

మకర రాశి

ఏలినాటి శని వలన ఇబ్బందులు. అందరికీ దూరంగా ఉండవలసి వస్తుంది. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు పడవచ్చు. బంధుమిత్రుల దర్శనం వల్ల ఆనందం. ఉద్యోగస్తులకు ధనవ్యయము. తల్లి వలన ధనలాభం ఉంటుంది.

కుంభ రాశి

ప్రభుత్వపరమైనటువంటి సంపద లభించుటకు అవకాశం ఉన్నది. మంచి భోజనం ప్రాప్తి. శత్రువులపై విజయం దక్కుతుంది. స్థానచలనం కలిగే అవకాశం ఉన్నది. అలాగే ధనం నష్టం, వాహనం సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం, కలుగుతాయి. ఎదుటి వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే గౌరవహానికి అవకాశం.

మీనరాశి

వృత్తి పరమైన విషయాలలో నష్టాలు కలుగవచ్చు. కుటుంబంలోని వ్యక్తులు శత్రుపీడను కలుగజేస్తారు. సోదరులు మూలకంగా మరియు దగ్గర ప్రయాణాల వలన విశేష ధనలాభం. పిల్లలు ఆడంబరాలు కోసం ధనవ్యయం చేయవలసి ఉంటుంది. రోగి భయము ఉంటుంది. సాయిబాబాను దర్శించడం వలన సంతోషము మరియు వృత్తిలో ఆనందం లభిస్తాయి.


Next Story

Most Viewed