- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరి కొయ్యలు కాలుస్తూ ప్రమాదవశాత్తు రైతు దుర్మరణం
by Taduka Kalyani |
వ్యవసాయ పొలంలో వరి కొయ్యలను తగలబెడుతుండగా జరిగిన ప్రమాదంలో ఓ రైతు మంటలు, దట్టమైన పొగలో చిక్కుకుని ఊపిరాడక అక్కడికక్కడే సజీవదహనమైన విషాద సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది.

X
దిశ, మిరుదొడ్డి: వ్యవసాయ పొలంలో వరి కొయ్యలను తగలబెడుతుండగా జరిగిన ప్రమాదంలో ఓ రైతు మంటలు, దట్టమైన పొగలో చిక్కుకుని ఊపిరాడక అక్కడికక్కడే సజీవదహనమైన విషాద సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మద్దెల మల్లయ్య (60) తన పొలంలో వరి కొయ్యలను తగలబెట్టడానికి నిప్పు పెట్టారు. ఆ సమయంలో గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు ఒక్కసారిగా పెద్దయెత్తున లేచాయి. చూస్తుండగానే పొలం చుట్టూ దట్టమైన పొగ అలుముకుంది. పొగ తీవ్రతకు ఊపిరి పీల్చుకోలేక, తీవ్రమైన వేడి కారణంగా మల్లయ్య స్పృహతప్పి పొలంలోనే పడిపోయారు. అదుపుతప్పిన మంటలు ఆయనకు సైతం అంటుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మిరుదొడ్డి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
Next Story






