- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంటల్లో పెళ్లి.. వరుడు చేసిన పనికి అందరూ షాక్ ..
by Shyam |
<p>దిశ, కంది: మరో గంటలో పెళ్లి జరుగుతుందన్న తరుణంలో కట్నంగా ఇచ్చిన డబ్బు, బంగారంతో పెళ్ళికొడుకు పరారైన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి రూరల్ ఎస్ఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12న కంది మండలం చీమనపూర్ గ్రామానికి చెందిన యువతికి, కొండాపూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన మాణిక్య రెడ్డితో వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. కానీ అదే రోజు వరుడు కట్నంగా ఇచ్చిన 25 లక్షల నగదుతో పాటు 25 తులాల […]</p>

X
దిశ, కంది: మరో గంటలో పెళ్లి జరుగుతుందన్న తరుణంలో కట్నంగా ఇచ్చిన డబ్బు, బంగారంతో పెళ్ళికొడుకు పరారైన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి రూరల్ ఎస్ఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12న కంది మండలం చీమనపూర్ గ్రామానికి చెందిన యువతికి, కొండాపూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన మాణిక్య రెడ్డితో వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. కానీ అదే రోజు వరుడు కట్నంగా ఇచ్చిన 25 లక్షల నగదుతో పాటు 25 తులాల బంగారాన్ని తీసుకొని అక్కడినుంచి పారిపోయాడు. దీనితో పెళ్లి ఆగిపోయింది. వరుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా పారిపోయారు. ఈమేరకు వధువు తల్లిదండ్రులు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






