- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెండ్లి డీసీఎం బోల్తా.. వరుడు సేఫ్.. కానీ
<p>దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పెళ్లి బృందంతో వెళుతున్న డీసీఎం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మందికి గాయాలు కాగా, అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచెడు గ్రామానికి చెందిన పెళ్లి బృందం రాత్రి కొల్లాపూర్ మండలం ఏలూరు గ్రామంలో గురువారం ఉదయం జరగాల్సిన పెళ్లికి డీసీఎంలో బయల్దేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న […]</p>

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పెళ్లి బృందంతో వెళుతున్న డీసీఎం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మందికి గాయాలు కాగా, అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచెడు గ్రామానికి చెందిన పెళ్లి బృందం రాత్రి కొల్లాపూర్ మండలం ఏలూరు గ్రామంలో గురువారం ఉదయం జరగాల్సిన పెళ్లికి డీసీఎంలో బయల్దేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న వాహనం కొల్లాపూర్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ సమయంలో డీసీఎంలో మొత్తం 65 మంది ఉండగా, అందులో 14 మందికి గాయాలు అయ్యాయి. దీంతో గమనించిన స్థానికులు, అటువైపు వెళుతున్న మరో ఆర్టీసీ బస్సులో కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో పెళ్లి కుమారుడు రాజుకి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పెళ్లి బృందం ఊపిరిపీల్చుకున్నారు.






