ఈ నెల 7 నుంచి ఆనందయ్య మందు లభ్యం.. వెబ్ సైట్ ఇదే..

by  |
ఈ నెల 7 నుంచి ఆనందయ్య మందు లభ్యం.. వెబ్ సైట్ ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య తయారు చేసిన కరోనా మందు పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వడంతో.. మందు పంపిణీకి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో మందు కోసం కృష్ణపట్నం ఎవరూ రావొద్దని కోరిన ఆనందయ్య.. ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వమే ఉచితంగా మందు పంపిణీ చేయనుండగా.. దీని కోసం వెబ్ సైట్‌ను అధికారులు అందుబాటులోకి తెచ్చారు.

www.childeal.in వెబ్ సైట్ అందుబాటులోకి తెచ్చారు. ఈ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే కొరియర్ ద్వారా మందు పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల 7 నుంచి ఆనందయ్య మందు అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

Next Story

Most Viewed