దారుణంగా పెరిగిన చలి తీవ్రత.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

by Muthe.Rajitha |

తెలంగాణలో చలి తీవ్రత అధికంగా పెరిగింది. అన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి.

దారుణంగా పెరిగిన చలి తీవ్రత.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో చలి తీవ్రత అధికంగా పెరిగింది. అన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. సాయంత్రం నుంచి మరుసటి రోజు పొద్దున్న ఎండ వచ్చే వరకు కాలు బయట పెట్టాలంటేనే వణికి పోతున్నారు. గత 3 రోజుల నుంచి సాధారణం కంటే 4 డిగ్రీలకు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలియ జేశారు. కొన్ని జిల్లాల్లో ఈ రాత్రికి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోనున్నట్టు హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు అధికారులు. ఆయా జిల్లాల ప్రజలు అత్యవసరం అయితే తప్ప రాత్రిపూట కనీస జాగ్రత్తలు లేకుండా బయటికి రావొద్దని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధ వ్యాధులతో బాధ పడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇక ఏపీలో కూడా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ నమోదు అవుతున్నాయి.

Next Story