నగరంలో చల్లబడిన వాతావరణం.. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షం

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-18 11:10:04  IST  )

హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం ఆకస్మిక వర్షం నగరవాసులకు కాస్త ఉపశమనాన్ని కలిగించింది.

నగరంలో చల్లబడిన వాతావరణం.. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ (Hyderabad) మహానగంలో జనం భానుడి ప్రతాపంతో అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే వరుణుడు స్వల్ప ఊరటనిచ్చారు. ఇవాళ మధ్యాహ్నం నగరం అంతటా ఆకాశం మేఘావృతమై పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. నగరంలోని తూర్పు, మధ్య భాగాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా అమీర్‌పేట్ (Ameerpet), జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో చుట్టుపక్క ప్రాంతాలు, ఎల్బీ నగర్ (LB Nagar), హయాత్‌నగర్, వనస్థలిపురం (Vanasathalipuram), పెద్ద అంబర్‌పేట్ పరిసరాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ జల్లులు పడ్డాయి. నగరవ్యాప్తంగా మేఘాలు కమ్ముకోవడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ అకస్మిక వర్షం వేసవి తాపం నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించింది. మరికొన్ని గంటల పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Next Story