- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు ప్రజలకు హెచ్చరిక.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ (Telangana)లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ (Telangana)లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేశారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ ఉరుములతో కూడిన వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో వర్షం పడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, ఇలాంటి జిల్లాలలో అతి భారీ వర్షాలు పడబోతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జయంశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డితో పాటు సిరిసిల్ల జిల్లాలో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.






